PKSDT: పవన్ సినిమాకు ఊహించని పేరు.. ఆ స్టార్ హీరో పాటనే టైటిల్‌గా.. పోస్టర్ ఎప్పుడు వస్తుందంటే!
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకుని బడా హీరోగా వెలుగొందుతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ముఖ్యంగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత అతడితో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అందుకే ఏకకాలంలోనే ఎన్నో సినిమాల్లో నటిస్తున్నాడు. ఫలితంగా తీరక లేని షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఇక, ప్రస్తుతం పవన్ నటిస్తోన్న చిత్రాల్లో 'వినోదయ సీతమ్' రీమేక్ ఒకటి. తాజాగా ఈ మూవీకి ఓ ఊహించని టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!

పవన్, సాయితేజ్ మల్టీస్టారర్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి 'వినోదయ సీతమ్' మూవీని రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌కు చెందిన నటుడు, దర్శకుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేరుగా ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. అక్కడ అదిరిపోయే స్పందన రావడంతో పవన్ కల్యాణ్ ఈ సినిమాను రీమేక్ చేస్తున్నాడు.

ఇందులో ఎవరు ఉన్నారంటే: పవన్ కల్యాణ్ - సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్‌లో మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీలు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా చేస్తోన్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేకు వర్క్ చేస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు భాగం అయ్యారు.
జెట్ స్పీడ్.. పవన్‌ది కంప్లీట్: క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్‌ను ఫిబ్రవరి నెలఖరున ప్రారంభం అయింది. అంతేకాదు, ఆ వెంటనే పవన్ కల్యాణ్‌కు సంబంధించిన పార్టును కూడా కంప్లీట్ చేసేశారు. ఇలా ఇప్పటికే ఈ మూవీ షూట్ దాదాపుగా పూర్తవడానికి వచ్చింది. మిగిలిన భాగాన్ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని జూలై 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

టైటిల్ విషయంపై ప్రచారం: మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే 'దేవర' సహా చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. అంతేకాదు, మెగా అభిమానులు వీటిని ట్విట్టర్‌లో ట్రెండ్ కూడా చేశారు. కానీ, చిత్ర యూనిట్ మాత్రం దేనీపైనా స్పందించలేదు. దీంతో రోజుకో పేరు అన్నట్లు వైరల్ అవుతోన్నాయి.
ఊహించని టైటిల్ కన్ఫార్మ్: పవన్ కల్యాణ్.. సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాకు 'దేవుడే దిగి వచ్చినా' అనే పేరును కన్ఫార్మ్ చేశారట. ఇప్పటికే నిర్మాతలు దీన్ని ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించారని తెలిసింది. గతంలో నాగార్జున నటించిన సంతోషం మూవీలో ఈ పాట ఉన్న విషయం తెలిసిందే. ఇక, ఈ టైటిల్ పోస్టర్‌ను మే మొదటి వారంలో విడుదల చేస్తారని సమాచారం.

దేవుడిగా పవన్.. సాయి ఇలా: విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి స్వర్గలోకానికి వెళ్తాడు. అక్కడ దేవతల అనుగ్రహంతో 60 రోజుల పాటు భూలోకంలో ఉండటానికి పర్మీషన్ పొందుతాడు. ఆ తర్వాత అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ మూవీ కథ. ఇందులో దేవుడి పాత్రలో పవన్ కల్యాణ్.. ఆ బాధితుడిగా సాయి ధరమ్ తేజ్‌లు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











