'దేవుడు చేసిన మనుషులు'లో వాళ్ళపై సెటైర్లు??
రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో పూరీ జగన్నాధ్ రూపొందించుతున్న చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'. బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుని వచ్చిన ఈ చిత్రం ప్రెండ్ షిప్ మీద సెటైర్ గా రూపొందిందని తెలుస్తోంది. ఎంతో స్నేహంగా ఉండే వ్యక్తులు..అవసరాలు వచ్చే సరికి ఎలా దూరమైపోతారో ఈ చిత్రం ఫన్ తో కూడిన సెటైర్ గా చెప్పాడని,కమర్షియల్ స్నేహాలపై ఈ చిత్రం ఓ వ్యగ్య బాణం అని,అటువంటి వ్యక్తులకు అది సూటిగా గుచ్చుకుంటుందని చెప్పుకుంటున్నారు.
ఆ మధ్య కాలంలో పూరి బిజినెస్ మ్యాన్ చిత్రానికి ముందు ఫైనాన్సియల్ గా ఇబ్బంది పడటం,నమ్మిన వారే మోసం చేయటం వంటివి ఈ చిత్రంలో చూపించాడని, వారికి ఇవి తప్పని సరిగా గుచ్చుకుంటాయని అంటున్నారు. పూరీ నిజ జీవిత పాత్రలు కొన్ని ఈ చిత్రంలో చోటు చేసుకున్నాయని,సోషియా ఫాంటసీ గా చెప్పబడుతున్న ఈ చిత్రం రియల్ గా తన చుట్టూ చేరి తనను దెబ్బ తీసిన వ్యక్తులపై పూరీ ఎక్కుపెట్టిన బాణంలాంటిదని చెప్పుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం గురించి పూరీ జగన్నాధ్ మాత్రం ..దేవుడున్నాడా? లేడా? అనే ప్రశ్న వేసుకోవడం, సమాధానం కోసం తర్కానికి విరుద్ధంగా ఆలోచించడం.. ఇవన్నీ కాలహరణమే. ఆపదలో ఆదుకొన్న మనిషిలో, ఆకలి పోగొట్టిన మనసులో దేవుడ్ని చూసుకోవచ్చు. దేవుడంటే గుడిలోనే ఉండాలని ఏముంది? అడుగడుగున గుడి ఉంది... అందరిలో గుడి ఉంది. ఆ విషయమే మా కథలో చెబుతున్నాం అన్నారు. అలాగే చిత్రం పొగ్రెస్ వివరిస్తూ...ఇటీవల బ్యాంకాక్‌లో రవితేజ, ఇలియానా, ప్రకాష్‌రాజ్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం అన్నారు.
రవితేజ సరసన ఇలియానా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ,ఎంఎస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు,ఫిష్ వెంకట్, జ్యోతిరానా వంటి వారు నటిస్తున్నారు. ఫొటో గ్రఫి..శ్యామ్ కె నాయుడు, సంగీతం ..రఘు కుంచే, పాటలు..భాస్కర భట్ల, ఎడిటింగ్ ..ఎస్ ఆర్ శేఖర్. కథ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్సకత్వం...పూరీ జగన్నాధ్.


Click it and Unblock the Notifications











