పూరీ 'దేవుడు చేసిన మనుషులు'పై ఆ రూమర్ ?
హైదరాబాద్: రవితేజ తాజా చిత్రం 'దేవుడు చేసిన మనుషులు'ఆగస్టు 15న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ కావటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇది రూమర్ అని కొందరు కొట్టిపారేస్తున్నా..రిలీజ్ డేట్స్ మార్చటం వెనక అసలు కీలకం ఇదే అంటున్నారు. బిజినెస్ కాకపోవటానికి కారణం పూరి జగన్నాధ్ కారణం అంటున్నారు. చిత్రంలో కథేమీ లేదని ప్రకటించటం తో వ్యాపార వర్గాలు వెనకంజ వేస్తున్నాయని,అందులోనూ రవితేజ ప్లాపుల్లో ఉండటం కూడా ఈ సినిమా బిజినెస్ కు మైనస్ గా మారిందంటున్నారు.
వాస్తవానికి రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ అనగానే నిజానికి బయ్యర్లు పోటీలు పడి బిజినెస్ జరిగాలి. కానీ దీనికి విరుద్ధంగా జరగడం ట్రేడ్ సర్కిల్‌లలో ఆశ్చర్యం కలిగిస్తోంది. పూరి జగన్నాథ్‌కు రీసెంట్‌గా 'బిజినెస్‌మేన్' సూపర్‌హిట్ చిత్రంగా తన అకౌంట్‌లో ఉంది. రవితేజ మాత్రం వరుసగా ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నాడు. లేటెస్ట్‌గా వచ్చిన 'దరువు' కూడా పెద్ద ప్లాప్ అయ్యింది. ఈ పరాజయాల కారణంగానే 'దేవుడు చేసిన మనుషులు' ముందుగా అంచనా వేసిన ప్రకారం వ్యాపారం జరుపుకోవడం లేదని సమాచారం. ఫ్లాప్ హీరో సినిమాను కొనడం అంటే రిస్క్ చేసినట్టే.
దీనికి తోడు పూరీ జగన్నాధ్ తాను దేవుడు చేసిన మనుషులు చిత్రాన్ని కథ లేకుండా తీసినట్లుగా పూరి పలుమార్లు చెప్పడం వల్ల బయ్యర్ల అనుమానం నిజమైంది. మరోవైపు ఈ చిత్రంలో ప్రముఖ కార్పొరేట్ సంస్థ రిలయన్స్ భారీ పెట్టుబడి పెట్టింది. దాంతో నిర్మాణ వ్యయం తడిసి మోపెడయింది. ఆ రేంజ్‌లో బిజినెస్ జరగాలంటే కొంత ఇబ్బందే అయినా, నిర్మాతకున్న గుడ్‌విల్ వల్ల వాటిని అధిగమించి రిలీజ్ చేస్తారని వ్యాపార వర్గాల సమాచారం.
ఒకేతరహా కథాంశాలను అంగీకరిస్తుండడం వల్ల రవితేజకు ఈ ఇబ్బంది తప్పడం లేదు. రెమ్యునేషన్ కి ఇచ్చే ప్రాధాన్యత కథకు ఇవ్వడని, సినిమా ఎలా తీస్తారో కూడా తెలుసుకోకుండా సైన్ చేస్తారని ఆయనపై విమర్శలూ ఉన్నాయి. దీనిని నిజం చేస్తూ ఆయన చిత్రాలన్నీ పరాజయం పాలవుతున్నాయి. ఇది తెలిసీ బయ్యర్లు వెనకడుగు వేస్తున్నారన్నది నిజం.
ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోవై సరళ, సుబ్బరాజు, ఫిష్ వెంకట్, జ్యోతి రాణా, మానస, గాబ్రియేల్ బర్తాంతే తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల, ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు, కూర్పు: ఎస్.ఆర్. శేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఫైట్స్: విజయ్, డాన్స్: ప్రదీప్ ఆంథోని, దినేశ్, సహ నిర్మాత: భోగవల్లి బాపినీడు, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











