Dhanush Aishwarya: ఊహించని ట్విస్ట్.. ధనుష్-ఐశ్వర్యల విడాకులు రద్దు! మళ్లీ కలిసిపోనున్న జంట?

కోలీవుడ్​ స్టార్​ కపుల్​గా 18 ఏళ్లు కలిసున్నారు ధనుష్​-ఐశ్వర్య రజనీకాంత్​. ఏమైందో తెలియదు కానీ, ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే ఎప్పటికైనా వీళ్లిద్దరూ మళ్లీ కలవకపోతారా? అని ఫ్యాన్స్​ ఎదురుచూశారు. ఆ సమయంలోనే సోషల్​ మీడియా అకౌంట్​లలో తన పేరు చివరన ఉన్న ధనుష్​ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్​గా మార్చేసుకుని ఇక కలిసేదేలా అన్నట్లు షాక్ ఇచ్చింది. అయితే ఇదంతా మొన్నటి మాట. కానీ ఇప్పుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు ధనుష్-ఐశ్వర్య. ఈ ట్విస్ట్ తో రజనీకాంత్ ఫ్యాన్స్ తో సహా ప్రేక్షకలోకం కూడా సంతోషం వ్యక్తం చేస్తోంది.

 రజనీ కాంత్​ కుమార్తెగా పరిచయమై..

రజనీ కాంత్​ కుమార్తెగా పరిచయమై..

ధనుష్.. కోలీవుడ్​లో స్టార్​ హీరోలలో ఒకరు. ఐశ్వర్య రజనీకాంత్​.. సూపర్​ స్టార్​ రజనీ కాంత్​ కుమార్తెగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో మహిళా దర్శకులిరాలిగా పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ సినీ ఇండస్ట్రీలో ధనుష్​-ఐశ్వర్య జంట చూడముచ్చటగా ఉండేది.

18 ఏళ్లపాటు వివాహ బంధంతో..

18 ఏళ్లపాటు వివాహ బంధంతో..

18 ఏళ్లపాటు వివాహ బంధంతో కలిసి ఉన్న ధనుష్​-ఐశ్వర్య అనూహ్యంగా జనవరి 18, 2022న విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులే కాకుండా, సినీ ప్రేక్షకులు షాక్​కు గురయ్యేలా చేశారు. 'భార్యాభర్తలుగా, స్నేహితులుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి జీవించిన మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం' అని పోస్ట్​ పెట్టి ఆశ్చర్యపరిచారు.

రజనీకాంత్​ పేరు చేర్చి..

రజనీకాంత్​ పేరు చేర్చి..

ఈ వార్తతో సూపర్​ స్టార్​ రజనీ కాంత్, ధనుష్​ ఫ్యాన్స్​ తీవ్రంగా బాధపడ్డారు. అయితే ధనుష్​ తండ్రి వారిద్దరూ మళ్లీ కలుస్తారని, రజనీకాంత్​ మాట్లాడి వాళ్లను తిరిగి ఒక్కటి చేస్తారని చెప్పుకొచ్చారు. దీంతో వాళ్లిద్దరు ఎప్పటికైనా కలవకపోతారా? అని ఎంతో ఎదురుచూశారు. కానీ, అలా జరగలేదు. ఇంకా తన సోషల్​ మీడియా అకౌంట్​లలో తన పేరు చివరన ఉన్న ధనుష్​ పేరు తొలగించి రజనీకాంత్​ పేరును చేర్చి ఐశ్వర్య ఇంకా షాక్​ ఇచ్చింది.

 విడాకుల నిర్ణయం వెనక్కి..

విడాకుల నిర్ణయం వెనక్కి..

ఇదంతా మొన్నటివరకు. కానీ ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలిసిపోనున్నట్లు తెలుస్తోంది. విడాకులతో విడిపోవాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. తమ విడాకులను ప్రస్తుతానికి నిలిపివేయాలని ధనుష్, ఐశ్వర్య అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే వారి మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం ఐశ్వర్య-ధనుష్ కుటుంబాలు రజనీకాంత్ ఇంట్లో సమావేశామయ్యారని టాక్.

 పెద్దల సమక్షంలో..

పెద్దల సమక్షంలో..

అక్కడ ఈ జంటకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో జరిగిన ఈ చర్చల్లో భాగంగా ధనుష్-ఐశ్వర్య మధ్య రజనీ కాంత్ సయోధ్య కుదిర్చాడట. పెద్దల మాటలను గౌరవించి వారిద్దరు కలిసిపోయేందుకు నిర్ణయించుకున్నారనే టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. అంతేకాకుండా ధనుష్ అండ్ ఐశ్వర్యలు ఇప్పటివరకు అధికారికంగా విడాకుల కోసం అప్లై చేసుకోలేదని, అందుచేత వాళ్లు కలిసిపోయేందుకు ఎలాంటి అడ్డంకి కూడా లేదని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

 ఈ ఊహించని ట్విస్ట్ తో..

ఈ ఊహించని ట్విస్ట్ తో..

ఈ ఊహించని ట్విస్ట్ తో రజనీ కాంత్, ధనుష్, ఐశ్వర్య అభిమానలే కాకుండా సగటు ప్రేక్షకులు కూడా సంతోషపడుతున్నారు. అయితే ధనుష్-ఐశ్వర్య తిరిగి కలిసిపోయారన్న వార్త ఎంతవరకు నిజమన్నది తెలియదు. ఇప్పటివరకు అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X