విడాకులు తీసుకుని మంచి పని చేశాడంటున్న ధనుష్ ఫ్యాన్స్.. దానికంటే ఇదే నయమంటూ!
పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తమిళ హీరో ధనుష్ ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేశాడు. ఈ విషయం ప్రకటించిన వెంటనే ఆ వార్త వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఆయన విడాకులు తీసుకోవడమే మంచిది అయిందేమో అంటూ ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఆయన నటించిన తాజా చిత్రం మారన్. అలా ఎందుకు? అనే వివరాల్లోకి వెళితే

మార్చి 11న
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘మారన్'. మాళవిక మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాకు కార్తిక్ నరేన్ దర్శకుడు. ఇందులో ధనుష్ జర్నలిస్ట్ పాత్రలో నటించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమాను చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ తదితర భాషల్లో ఓటీటీ వేదిక ద్వారా మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

అన్నీ ఒటీటీలోనే
ప్రకటించిన విధంగానే శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ సినిమాను డిస్నీ-హాట్‌స్టార్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పటికే ధనుష్ నటించిన తమిళ సినిమాలు ‘జగమేతిందిరమ్', బాలీవుడ్ చిత్రం ‘అత్రంగి రే' ... వరుసగా ఓటీటీలో విడుదల అయ్యాయి. అలా ఈ సినిమా కూడా ఓటీటీలో విడుదల చేయం విషయంలో ముందు అభిమానులు బాధ పడ్డా ఇప్పుడు అది ఓటీటీలోనే విడుదల కావడం మంచిది అయిందని లేదంటే కలెక్షన్స్ విషయంలో బాధ పడాల్సి భావిస్తున్నారు.

తలలు పట్టుకుంటున్న పరిస్థితి
డిజిటల్ వేదికగా విడుదలైన మారన్ సినిమా ఏమాత్రం బాలేదని అంటున్నారు. ఈ సినిమా తమిళ ఆడియన్స్ ను కూడా మెప్పించలేకపోయింది. ఈ సినిమా చూసిన వారు ధనుష్ స్క్రిప్ట్ సెలక్షన్ ఏంట్రా బాబు ఇలా ఉంది అని తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి విడాకులు తీసుకుంటే కెరీర్ దెబ్బతింటోందని సోషల్ మీడియాలో ముందు అభిమానులు బాధ పడ్డారు.

అభిమానులను సైతం
ధనుష్ జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా ఈసారి ఎలాంటి పాత్ర పోషించాడు? ఎలా ప్రేక్షకులను అలరించనున్నాడు అని అందరూ ఆసక్తిగా చూస్తారు. కానీ ఆయన నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు అస్సలు ఆకట్టుకోవడం లేదు. ఆ సినిమాలు ఆయన అభిమానులను సైతం నిరాశపరిచాయి.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు
అసురన్ తర్వాత ధనుష్ నటించిన తూటా, పట్టాస్, జగమే తంధిరమ్, అత్రంగి రే, ఇప్పుడు మారన్ సినిమాలు పేలవమైన టాక్ తెచ్చుకున్నాయి. ఈ వరుస పరాజయాలు చూస్తుంటే ధనుష్ కాస్త విరామం తీసుకోవాలని ఆయన అభిమానులు భావిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం మానేయాలని వారంతా అభిప్రాయ పడుతున్నారు.
Recommended Video

ఇకనైనా
విడాకులు తీసుకోకుండా కలిసి ఉండి ఇబ్బందులు పడుతూ, ఆమె నుంచి దూరంగా ఉండడం కోసం వరుస సినిమాలు ఒప్పుకుంటూ ఇలాంటి సినిమాలు చేయడం కంటే తన వ్యక్తిగత సమస్యల నుండి బయటపడ్డాడు కాబట్టి ఇక మీద మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడం ప్రారంభించాలని మరియు నటుడిగా స్కోప్ ఉన్న పాత్రలు చేయాలనీ ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.


Click it and Unblock the Notifications











