ప్రపంచం మెచ్చిన మాస్టర్ మైండ్ బయోపిక్.. ధనుష్ సరికొత్త ప్రయోగం
వెండితెరపై బయోపిక్ లకు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ డోస్ అయితే ఇప్పట్లో తగ్గేలా లేదు. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ కు సంబంధించిన సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. అప్పుడెప్పుడో వచ్చిన బాగ్ మిల్కా బాగ్ సినిమా నుంచి మొన్న వచ్చిన ఎమ్ఎస్.ధోని సినిమాక్ వరకు అన్ని కూడా ఒక ట్రెండ్ సెట్ చేశాయి.
ఇక ఎప్పటికైనా అలాంటి కథలకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని తేలుసుకున్న దర్శకులు అన్ని రకాల స్పోర్స్ బయోపిక్ ల గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఈ సారి బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఒక ప్రపంచం మెచ్చిన చదరంగం వీరుడు విశ్వనాథన్ ఆనంద్ కథను తెరకెక్కించాడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఏ స్థాయిలో వండర్స్ క్రియేట్ చేశాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ ఆటకు మన దేశంలో అంతగా గుర్తింపు లేకపోవడం వలన ఆనంద్ పేరు ఇంకా అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. లేకుంటే మరో లెవెల్లో ఉండేది.

చెస్ ఆటతో భారత్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఇతర దేశాల దిగ్గజాలకు ఫొటోగా నిలవగలదని గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ఆయనది. విశ్వనాథన్ చెస్ పోటీలలో ఎన్నో పథకాలు అందుకున్నారు. ఇక ఆయన బయోపిక్ కథలో ధనుష్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల చర్చల్లో దర్శకుడికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చదరంగం ఆటలో ఉన్న గొప్పతనాన్ని సినిమాటిక్ గా చూపిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకోవచ్చని దర్శకుడు ఆనంద్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











