For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊహించని విధంగా ఇస్మార్ట్ శంకర్ రీమేక్‌.. రామ్ పాత్రలో స్టార్ హీరో.. అతడికే సెట్ అవుతుందంటున్నారు.!

|
This Popular Actor Is Likely To Remake iSmart Shankar In Tamil || Filmibeat Telugu

సరైన హిట్ కొట్టాలనే కసితో టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ - టాలీవుడ్ బడా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పక్కా మాస్ మసాలా కథతో రూపొందిన ఈ సినిమాను బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు సూపర్ డూపర్ హిట్ చేశారు. మొదట్లో మిక్స్‌డ్ టాక్‌ను దక్కించుకున్నప్పటికీ, క్రమంగా హిట్ చిత్రంగా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా న్యూస్..? వివరాల్లోకి వెళితే...

భారీ స్థాయిలో కలెక్షన్లు

భారీ స్థాయిలో కలెక్షన్లు

‘ఇస్మార్ట్ శంకర్' టాక్ మాత్రమే కాదు.. కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం రూ.31.92 కోట్ల షేర్, రూ.54.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇతర రాష్ట్రాల్లో సుమారు రూ.2 కోట్ల గ్రాస్, రూ.4.45 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఓవర్సీస్‌లో సుమారు రూ.1 కోటి, గ్రాస్ రూ.2.15 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.34.89 కోట్ల గ్రాస్, రూ.61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయడంతో 202 శాతం లాభాలను రాబట్టింది.

ఇద్దరి కెరీర్లను మార్చేసింది

ఇద్దరి కెరీర్లను మార్చేసింది

జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన ‘టెంపర్' తర్వాత నుంచి పూరీ జగన్నాథ్ వరుసగా ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ, అతడి ప్రతి ప్రయత్నం విఫలమవుతూనే వచ్చింది. అలాగే, రామ్‌కు కొన్ని హిట్లు వచ్చినప్పటికీ స్టార్ హీరో హోదాను కట్టబెట్టలేకపోయాయి. అయితే, ఇస్మార్ట్ శంకర్ తర్వాత వీరిద్దరి జాతకాలు మారిపోయాయి. పూరీ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కడంతో పాటు రామ్‌కు కూడా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ దక్కింది. దీంతో ఇద్దరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.

క్యూ కడుతున్న బడా ప్రొడ్యూసర్లు

క్యూ కడుతున్న బడా ప్రొడ్యూసర్లు

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఘన విజయం సాధించడానికి తోడు మాస్ సినిమాగా రూపొందడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్లు తమ తమ భాషల్లోకి సినిమాను రీమేక్ చేసుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది బడా ప్రొడ్యూసర్లు పూరీ జగన్నాథ్ అండ్ కోతో సంప్రదింపులు జరిపారని ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా మరోసారి చర్చనీయాంశం అవుతోంది.

ఊహించని ధరకు రీమేక్ హక్కులు

ఊహించని ధరకు రీమేక్ హక్కులు

తాజాగా ఈ సినిమా తమిళ రీమేక్ హక్కులు అమ్ముడయ్యాయని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అది కూడా ఊహించని ధరకు అని సమాచారం. ఇందులో తమిళ స్టార్ హీరో ధనూష్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. ధనూష్ ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ‘ఎన్నై నోకి పాయుమ్ తోట' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది పూర్తయిన వెంటనే అతడు ‘ఇస్మార్ట్ శంకర్' రీమేక్‌లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్' గురించి

‘ఇస్మార్ట్ శంకర్' గురించి

విజయం కోసం పరితపిస్తున్న పూరీ జగన్నాథ్ - ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్'. పూరి సొంత బ్యానర్ టూరింగ్ టాకీస్, సీనియర్ హీరోయిన్ ఛార్మీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ నటించారు. అలాగే, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు.

English summary
Telugu star Ram Pothineni has landed himself in some soup. The actor, who will soon be seen in iSmart Shankar, was in Hyderabad recently. The 31-year-old star was filming for the Tollywood film in the city when the cops caught him doing something illegal on the sets of iSmart Shankar.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more