Dhanush, Aishwarya Divorce: రజనీకాంత్, ధనుష్ ఫ్యామిలీలో వరుస విడాకుల వివాదాలు.. ఎంతమంది విడిపోయారంటే?
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి ఇటీవల కాలంలో మరింత హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ సెలబ్రేటీలు వివిధ రకాల కారణాల వలన వారి దాంపత్య జీవితాన్ని తెంచేసుకుంటున్నారు. గడచిన కొన్ని నెలల్లో బాలీవుడ్ టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకుంటున్న సెలబ్రెటీల సంఖ్య ఎక్కువవుతోంది.
గత రాత్రి ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా వారికి సంబంధించిన అనేక రకాల విషయాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక ఇంతకుముందు ధనుష్, రజినీకాంత్ ఫ్యామిలీలో కూడా కొందరు సెలబ్రెటీలు విడిపోయారు.

ఆరు నెలల్లోనే..
ఐశ్వర్య.. రజనీకాంత్ పెద్ద కుమార్తె కాగా 23 ఏళ్ళ వయసులోనే ధనుష్ ను వివాహం చేసుకుంది. అప్పుడు ధనుష్ కు 21 ఏళ్ళు. ఇద్దరు కూడా ఆరు నెలల పరిచయంతోనే చాలా క్లోజ్ అయ్యారు. ఇక పెళ్లికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో చెన్నై లో గ్రాండ్ గా వివాహం జరిగింది. 18 ఏళ్ళ వీరి దాంపత్య జీవితంలో ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. సోషల్ మీడియాలలో కూడా వీరికి సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

రజనీకాంత్ చిన్న కూతురు కూడా..
ఇక రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య కూడా తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుంది. అశ్విన్ రామ్ కుమార్ ను 2010లో పెళ్లి చేసుకున్న ఆమె 2017లోనే విబేధాలు కారణంగా విడిపోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. వీరికి 2015లో వేద్ కృష్ణ అశ్విన్ అనే కుమారుడు ఉన్నాడు. అనంతరం ప్రముఖ బిజినెస్ మెన్ తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న సౌందర్య అతన్ని 2019లో వివాహం చేసుకుంది.

ధనుష్ అన్న కూడా
రజనీకాంత్ ఫ్యామిలీలో ఇదివరకే సౌందర్య విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకోగా అనంతరం ఐశ్వర్య కూడా ధనుష్ కు విడాకులు ఇచ్చేసింది. అయితే ధనుష్ కుటుంబంలో కూడా ఇప్పటికే తన అన్నయ్య ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకొని అనంతరం వివాదలతోనే విడాకులు తీసుకున్నాడు. అప్పట్లో ఆ వార్త మీడియాలలో చాలా వైరల్ అయ్యింది.

స్టార్ డైరెక్టర్ గా..
ధనుష్ అన్నయ్య మరెవరో కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సెల్వా రాఘవన్. అప్పట్లో అతను డైరెక్ట్ చేసిన 7/G బృందావన కాలనీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించింది. సెల్వా రాఘవన్ తెలుగులో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే సినిమాను కూడా డైరెక్ట్ చేశాడు. యుగానికి ఒక్కడు కూడా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది.

హీరోయిన్ తో విడాకులు
ఇక సెల్వా రాఘవన్ 7/G బృందావన కాలనీ హీరోయిన్ సోనియా అగర్వాల్ ను 2006లో పెళ్లి చేసుకొని నాలుగేళ్లకే 2010లో విడాకులు ఇచ్చేశాడు. అప్పట్లో ఆ వార్త మీడియాలో ఎంతగానో వైరల్ అయ్యింది. ఇక 2011లో సెల్వా రాఘవన్ గీతాంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ధనుష్ ఇటీవల తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వీరికి సంబంధించిన గొడవలు కూడా బయటకు రాలేదు. ఇక ఇద్దరు ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకున్నట్లు సోషల్ మిసియాలో క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











