twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అసలుకొడుకు దొరికాడు? హీరో ధనుష్‌కు ఊరట.. !?

    చిన్నతనంలో తమ ఇంటి నుంచి పారిపోయిన తమ కుమారుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడని కదిరేశన్ దంపతులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

    |

    ధనుష్ పెళ్లి సమయంలో ఓ వ్యక్తి ఈ హీరో తమ కొడుకని, మాకు అప్పగించాలని అప్పట్లో కలకలం రేపిన విషయం తెలిసిందే.దీనిపై అప్పుడు ధనుష్ ఫాదర్, డైరెక్టర్ కస్తూరిరాజా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసి ఆ వివాదాన్ని పక్కకు జరిపారు. అయితే తర్వాత తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అయితే అలా అనుకున్నారు. తాజాగా మళ్ళీ అదే వివాదం తెర మీదకొచ్చింది.

    కదిరేశన్, మీనాక్షి దంపతులు

    కదిరేశన్, మీనాక్షి దంపతులు

    మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు మదురై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను, వాళ్లు కోర్టులు అందజేసిన పత్రాలను జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు.ఈ నేపథ్యంలో ఈ కేసు రద్దు చేయాలని కోరుతూ నటుడు ధనుష్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.

    స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని

    స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని

    ఈ కేసును విచారించిన కోర్టు పలుమార్లు విచారించింది. తాజాగా స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది.

    లేజర్ ద్వారా మచ్చలను తొలగించి

    లేజర్ ద్వారా మచ్చలను తొలగించి

    ఈ నేపథ్యంలో మధురై కోర్టులో హాజరైన ధనుష్‌కు వైద్య పరీక్షలు చేయాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ మెడికల్ రిపోర్టులో ధనుష్ లేజర్ ద్వారా మచ్చలను తొలగించినట్లు తేలింది. ఫలితంగా ధనుష్ కదిరేశన్ దంపతులకు జన్మించిన బిడ్డేనని వచ్చిన ఊహాగానాలకు బలం చేకూరింది. అయితే ఈ కేసులో తాజాగా మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

     తమ కుమారుడు

    తమ కుమారుడు

    చిన్నతనంలో తమ ఇంటి నుంచి పారిపోయిన తమ కుమారుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడని కదిరేశన్ దంపతులు చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. తద్వారా ధనుష్‌కు ఈ కేసు నుంచి విముక్తి లభించినట్లేనని సినీ జనాలు అంటున్నారు. అయినప్పటికీ ఇంకా కోర్టు తీర్పు వెలువరించని కారణంగా..

     తుది విచారణ

    తుది విచారణ

    ఏప్రిల్ 11 (మంగళవారం) ఈ కేసు తుది విచారణ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ధనుష్ పుట్టుమచ్చలు, డీఎన్ఏ టెస్టుపై విచారణ జరుగవచ్చునని తెలుస్తోంది. ఈ విచారణకు అనంతరమే కోర్టు తీర్పునివ్వనుంది.

    మేలూరులో

    మేలూరులో

    మధురై జిల్లాలోని మలంపట్టి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రయివేట్ బస్ కండక్టర్ అయిన కదిరేశన్ (60) - మీనాళ్ (55) దంపతులు మేలూరు మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. ఈ దంపతులే హీరో ధనుష్ తమ కొడుకని, తన అసలు పేరు కలై సెల్వన్ అని, పదో తరగతి వరకు మేలూరులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడని చెప్పారు.

    అసలు పేరు కలైసెల్వన్‌

    అసలు పేరు కలైసెల్వన్‌

    అంతేకాకుండా ధనుష్ ఇంటర్ అడ్మిషన్ శివగంగలో తీసుకున్నామని,అతని అసలు పేరు కలైసెల్వన్‌ కాగా చిన్నప్పుడు చదువుకోలేదని మందలించడంతో సినిమాల్లో నటించడానికి చెన్నై వెళుతున్నానని, తన కోసం వెతకవద్దని లేఖ రాసి వెళ్లిపోయాడని అందులో పేర్కొన్నారు.

    కోలీవుడ్ లో అనుమానాలు

    కోలీవుడ్ లో అనుమానాలు

    అంత బలంగా ఎలా ఎచెప్పగలుగుతున్నారు అన్న అనుమానాలూ కలుగుతున్నాయ్. మరీ ఇంటర్ తర్వాత ఇంటినుంచి వెళ్ళిపోయాడన్న మాట కదిరేషన్ దంపతులు చెబుతున్నారు, ధనుష్ ని చిన్న తనం నుచీ కస్తూరిరాజా ఇంట్లో ధనుష్ ని చూసిన వాళ్ళు ఎవరూ నోరు విప్పకపోవటం, కస్తూరి రాజా ఫ్యామిలీతో ధనుష్ చిన్న నాటి ఫోటోలని విడుదల చేయకపోవటం వల్ల కూడా కోలీవుడ్ లో అనుమానాలు రేకెత్తాయి... మొత్తానికి ధనుష్ ఈ కేసునుంచి బాగానే "బయటపడ్డాడు"

    English summary
    As known, An elderly couple Kathiresan (65) and Meenakshi (53) was seen filing a strong case at the Madurai High Court on Dhanush stating that he is actually their son, and they were also seen seeking maintenance amount from him too while this paternity case is currently under the court judgment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X