Sekhar kammula సినిమా కోసం దిమ్మతిరిగే రెమ్యునరేషన్.. డబుల్ చేసేసిన ధనుష్?

ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరూ ఊహించని, మునుపెన్నడూ అంచనా వేయని కాంబినేషన్లు ఫిక్సవుతున్నాయి. దాదాపు అన్ని బాషల హీరోలకు, అన్ని బాషల సినిమాలకు మార్కెట్ లు భారీగా పెరుగుతూ ఉండడంతో ఊహకందని కాంబోలతో ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా శేఖర్ కమ్ముల -ధనుష్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ కాగా ఆ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

ట్రై లింగ్యువల్ సినిమా

ట్రై లింగ్యువల్ సినిమా

తమిళ స్టార్ హీరోగా ఉన్న ధనుష్ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ములతో జట్టు కట్టారు. ఒకరకంగా ధనుష్ ఇప్పుడు తమిళంతో పాటు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన శేఖర్ తో కలిసి ఒక ట్రై లింగ్యువల్ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయనతో సినిమా చేసేందుకు చాలా ఎదురు చూస్తున్నానని అంటూ ధనుష్ కూడా చెప్పుకొచ్చాడు.

మార్కెట్ లెక్కలతో

మార్కెట్ లెక్కలతో

నిజానికి దాదాపుగా ధనుష్ నటిస్తున్న అన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్బింగ్ అవుతున్నాయి. ఆ లెక్కన ధనుష్ కి టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపధ్యంలోనే ఆయన చేత ఇలా ఒక సినిమా చేయిస్తే దానిని తమిళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేయవచ్చని ప్లాన్ చేశారు.

ఆ నిర్మాతలే రెండో సారి

ఆ నిర్మాతలే రెండో సారి

ఇక ఈ కాంబో సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ మీద ఏషియన్ సంస్థ తరపున నారాయణ రావు దాస్ నారంగ, పుస్కుర్ రామమోహనరావు నిర్మించబోతున్నారు. ధనుష్‌ నటిస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో పాటు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల డైరెక‌్షన్‌ కావడంతో ఈ మూవీపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.

ఏకంగా డబుల్ ఛార్జ్

ఏకంగా డబుల్ ఛార్జ్

ఇక ఈ సినిమా కోసం ధనుష్ ఏకంగా 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమా మార్కెట్ పెద్దది కావడం ఎక్కువ డేట్స్ కూడా కేటాయించాల్సి రావడంతో ఆయన డబుల్ ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయన చివరిగా నటించిన జగమే తంత్రం సినిమా 17 భాషల్లో 190 దేశాల్లో రిలీజైంది. ఈ సినిమా కోసం ఆయన 15 కోట్లే తీసుకోగా శేఖర్ సినిమా కోసం దానికి డబుల్ ఛార్జ్ చేసినట్లు సమాచారం.

Recommended Video

Jagame Thandhiram Review, Dhanush's Kabali, హైప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ || Filmibeat Telugu
హీరోయిన్ ఆమేనా

హీరోయిన్ ఆమేనా

ఇక ఈ సినిమా గురించి మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా హీరోయిన్‌ సాయి పల్లవి నటించనుందని అంటున్నారు. ఇప్పటికే మేకర్స్‌ చర్చలు జరిపారని, సాయిపల్లవి కూడా సినిమా చేయడానికి ఒప్పుకుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X