మృణాల్‌తో ధనుష్ అఫైర్ మరోసారి తెరపైకి.. రచ్చ చేస్తున్న సోషల్ మీడియా పోస్ట్

సినిమా తారల మధ్య డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్ రూమర్లు, గాసిప్స్ రావడం సహజమే. అయితే టాప్ హీరో, హీరోయిన్ల మధ్య ఇలాంటి వార్తలు వస్తే.. అందరిలోను ఆసక్తి రేపుతుంది. వారి వ్యక్తిగత జీవితాల్లో ఏం జరుగుందో అనే క్యూరియాసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువగా ప్రచాధరమైన రూమర్ ఏమిటంటే.. ధనుష్, మృణాల్ థాకూర్ మధ్య అఫైర్. వారిద్దరి మధ్య ఏదో రిలేషన్‌పిష్ ఉందంటూ గుసగుసలు వినిస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒకరికొకరు తమ మనసులోని అభిప్రాయాలు పంచుకోవడంతో మరోసారి వారి గురించి రూమర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. ధనుష్, మృణాల్ థాకూర్ మధ్య సోషల్ మీడియాలో ఏం షేర్ చేసుకొన్నారనే వివరాల్లోకి వెళితే..

ధనుష్ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం సింగిల్. భార్యకు విడాకులు ఇచ్చి ఇండిపెండెంట్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నారు. దాంతో ఆయన ఎవరితోనైనా చనువుగా ఉంటే.. వారితో అఫైర్ అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో గతంలో హిందీ సినిమా ఈవెంట్‌లో ధనుష్‌తో మృణాల్ కౌగిలింత హాట్ టాపిక్‌గా మారింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చూసి అఫైర్ కొనసాగుతుందనే టాక్ వైరల్ అయింది.

Dhanush sends Heart emoji to Mrunal Thakur fuels dating rumours again

తాజాగా మృణాల్ థాకూర్ తాను నటిస్తున్న ఓ సినిమా గురించిన వార్తను సోషల్ మీడియా ద్వారా అందించింది. తాను దో దీవానే షహర్‌ కే అనే సినిమాలో నటిస్తున్నాను. సిద్దార్థ్ చతుర్వేది హీరోగా నటిస్తున్నారు అంటూ ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఆ సినిమా టీజర్‌ను ఇన్స్‌టాగ్రామ్ ద్వారా పంచుకొన్నది. అయితే ఆ పోస్ట్‌పై ధనుష్ స్పందించడం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

మృణాల్ థాకూర్ పోస్టుపై ధనుష్ లైక్ కొట్టాడు. అంతటితో ఆగకుండా కామెంట్ చేశాడు. నీవు ఆ సినిమా చేస్తున్నావనే విషయం, వార్త నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అని కామెంట్ చేశాడు. అలాగే హార్ట్ సింబల్‌తో సన్ ఫ్లవర్ ఎమోజీని పోస్టు చేశాడు. ఇంకేముంది.. ఆ కామెంట్ కింద రకరకాల కామెంట్స్ వినిపించాయి. మరోసారి వారిద్దరి మధ్య అఫైర్ వ్యవహారం చర్చకు వచ్చింది.

ఇదిలా ఉండగా, ధనుష్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీల కాలంలో ఆయన నటించిన మూవీస్ పెద్దగా ఆదరణ పొందలేదు. తాజాగా ఆయన నటించిన తేరే ఇష్క్ మే అనే చిత్రం నవంబర్ 28వ తేదీన రిలీజ్ అవుతున్నది. రాంజ్నా సినిమా తర్వాత ఆ సినిమా దర్శకుడితో ఆయన నటిస్తున్న ఈ చిత్రం కావడంతో అందరిలోను ఆసక్తి పెరిగింది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి.

More from Filmibeat

Read more about: dhanush mrunal thakur bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X