హీరో రాజశేఖర్, ఐశ్వర్య ధనుష్ సినిమాలో ఆ ఇద్దరు!
హీరో రాజశేఖర్ నటించిన 'గరుడవేగ' మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత రాజశేఖర్ కోసం కొంతమంది దర్శకులు వచ్చి కథ వినిపించడం జరిగింది. అయితే ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తాజాగా ఆయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

రాజశేఖర్ తో ప్రవీణ్
దర్శకుడు ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ' మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత రాజశేఖర్ కోసం కొంతమంది దర్శకులు వచ్చి కథ వినిపించడం జరిగింది. అయితే ప్రవీణ్ సత్తరు దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న సినిమాలో రాజశేఖర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఐశ్వర్య తో రాజశేఖర్
తాజాగా ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అంతకముందు ఐశ్వర్య దర్శకత్వం వహించిన సినిమా పేరు ''3'' మరియు ''వెయ్ రాజా వెయ్'' సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. మూడో సినిమాగా రాజశేఖర్ తో చేస్తుండడం విశేషం. విభిన్నమైన కథాంశం తో ఈ సినిమా తెరకేక్కబోతోందని సమాచారం.

సినిమాలో ధనుష్
సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ధనుష్ రాజశేఖర్ తో చేస్తున్న సినిమాలో ధనుష్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ధనుష్ అయితే ఈ పాత్ర బాగా చెయ్యగలడనేది దర్శకురాలి అభిప్రాయం. థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. జూలైలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

తండ్రి సినిమాలో శివాని
హీరో రాజశేఖర్ కుమార్తె శివాని కూడా ఐశ్వర్య దర్వకత్వం వహించే సినిమాలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె చెయ్యబోయే పాత్రకు సంబంధిచి పూర్తి వివరాలు తెలీనప్పటికీ తండ్రి సినిమాలో మంచి పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. ప్రస్తుతం శివాని అడవి శేష్ హీరోగా నటిస్తోన్న 2 స్టేట్స్ సినిమాలో నటిస్తోంది. వెంకట్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











