రామ్ చరణ్..డైరక్టర్ ధరణి చిత్రం స్టోరీ లైన్ ఏమిటి

By Srikanya

పవన్ కళ్యాణ్ తో బంగారం చిత్రం రూపొందించిన తమిళ చిత్ర దర్శకుడు ధరణి తాజాగా మరో కథతో రామ్ చరణ్ తో సినిమా చేయటానికి రెడీ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్.రత్నం తో కలసి వచ్చి చిరంజీవికి ఓ స్టోరీని నేరేట్ చేసారు. ఆ కథ హృతిక్ రోషన్ తో చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ క్రిష్ లా తరహాలో ఉందని సమాచారం. ఈ సోషియో పాంఠసీని రామ్ చరణ్ అయితేనే సరిపోతాడని భావించి తయారుచేసానని చెప్పాడుట. ఇక రామ్ చరణ్ కి ఈ లైన్ పిచ్చపిచ్చగా నచ్చిందిట. తనను తాను సూపర్ మ్యాన్ గా చూసుకోవాలనుకుంటున్నాడని, అటువంటి సబ్జెక్టులు పిల్లలను బాగా ఆకట్టుకుంటాయని చెప్పటం జరిగిందని వినపడుతోంది. అయితే చిరంజీవి,అల్లు అరవింద్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక ధరణి లేటెస్ట్ గా తమిళ సూపర్ స్టార్ విజయ్,త్రిష కాంబినేషన్లో కురవై సబ్జెక్టు రూపొందించాడు. కానీ అది ఫెయిల్యూర్ అయింది. దాంతో ఆయన ఇలా తెలుగు బాట పట్టారు. అన్నీ అనుకూలిస్తే బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న చిత్రం అనంతరం ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఏదైమైనా తెలుగులో త్వరలో సూపర్ మ్యాన్ కాన్సెప్ట్ రాబోతోందన్నమాట. బెస్టాఫ్ లక్ మగధీర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X