ప్రకాష్ రాజ్ ‘ధోనీ’ వెనక ఆ సినిమా?

By Bojja Kumar

నటుడు ప్రకాష్ రాజ్ 'ధోనీ' అనే చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కథ కూడా ప్రకాష్ రాజే సమకూర్చుకున్నాడు. ఇందులో పూరి తనయుడు ఆకాష్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. పిల్లల అభిరుచులను, ఇష్టా ఇష్టాలకు విలువ ఇవ్వకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలను ఎండగడుడు, వినోదం పాళ్లతో పాటు సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈచిత్రం విడుదలకు ముందే ఓ ప్రచారం జోరందుకుంది సినీ వర్గాల్లో. ఈ సినిమా ఇప్పటికే మరాఠీలో వచ్చిన 'శిక్షనచ్య అయిచ గో' అనే మూవీకి కాపీ అని, ఈ చిత్రాన్ని బేస్ చేసుకునే ప్రకాష్ రాజ్ 'ధోనీ' చిత్రాన్ని రూపొందించారని, ఇది పక్కా కాపీ సినిమా అని అంటున్నారు. మరాఠీలో వచ్చిన 'శిక్షనచ్య అయిచ గో' చిత్రానికి మహేష్ మంజ్రేకర్ కథ అందించారు. మరి ఈ ప్రచారంలో నిజమెంతో? సినిమా విడుదలైతేగానీ ఖశ్చితంగా చెప్పలేం.

ప్రకాష్ రాజ్, ఆకాష్ పూరి, ముగ్ధా గాడ్సే, రాధిక ఆప్టే, బ్రహ్మానందం, నాజర్, తలైవాసల్ విజయ్, ప్రభుదేవా(గెస్ట్ రోల్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఎడిటింగ్: కిషోర్, స్టూడియో: డ్యూయెట్ మూవీస్, నిర్మాత, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాష్ రాజ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X