Dhurandhar 2: రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డుల మోత...మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ ప్లాన్?
Dhurandhar 2: గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన సినిమా 'ధురంధర్'. ఇండస్ట్రీలో నయా రికార్డులు తిరగ రాసి సంచలనం సృష్టించిన సినిమాకు సీక్వెల్ గా వస్తున్న మూవీ ధురంధర్ 2 (Dhurandhar: The Revenge). ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లకు వచ్చిన స్పందనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆదిత్య ధర్ ఓ క్రేజీ ప్లాన్ సిద్దం చేస్తున్నారట. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటీ?
రణ్ వీర్ సింగ్ - ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన ధురంధర్ మూవీ ఎలాంటి రికార్డు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సిక్వెల్ గా ధురంధర్ 2 మూవీ. ఈ సీక్వెల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమా కథలో భారీ యాక్షన్ సన్నివేశాలు, బ్లాస్ట్‌లు, ట్విస్టులు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని సమాచారం. ముఖ్యంగా రణ్‌వీర్ సింగ్ పోషించిన జస్కిరత్ సింగ్ రంగీ పాత్రకు సంబంధించిన దాదాపు రెండు గంటల ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. అతను ఎందుకు స్పైగా మారాడు? తన ఆపరేషన్‌ను వ్యక్తిగత ప్రతీకారంగా ఎందుకు తీసుకున్నాడు? అనే అంశాలు ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఇలా ఎన్నో ట్విస్టులు, అంచనాలతో విడుదల అవుతున్న ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపేందుకు, రికార్డులు మోత మోగించేందుకు వచ్చేస్తోంది. మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ సేల్స్ కు ఇప్పటికే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రారంభమైన బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ప్రీమియర్ షోల ద్వారానే ఇప్పటికే సుమారు రూ.60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ నమోదయ్యాయని సమాచారం. ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రీమియర్ షోల ద్వారానే రూ.100 కోట్ల మార్క్ చేరుకునే అవకాశముందట.
మరోవైపు డైరెక్టర్ భార్య హీరోయిన్ యామి గౌతమ్ కూడా చిన్న పాత్రలో కనిపించే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ భారీ హైప్ మధ్య మరో క్రేజీ వార్త కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 'ధురంధర్ 2'కు వస్తున్న భారీ రెస్పాన్స్ చూసి దర్శకుడు ఆదిత్య ధర్ ఇప్పటికే 'ధురంధర్ 3' గురించి కూడా ఆలోచిస్తున్నారని టాక్. ప్రస్తుతం మూడో భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ దశలో ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధిస్తే ఈ ఫ్రాంచైజ్‌ను కొనసాగిస్తూ మూడో భాగాన్ని కూడా తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











