Dhurandhar 2: ధురంధర్ 2 కోసం రణవీర్ సింగ్ రికార్డు రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లంటే?

Dhurandhar 2 Ranveer Singh remuneration: బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ 'ధురంధర్ 2'. ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ 1 ఘన విజయం సాధించడంతోనే ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఈ సినిమా, విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌తో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడం ద్వారా తన స్టామినాను చూపించింది. విడుదలైన తొలిరోజే రికార్డు స్థాయిలో వసూళ్లు చేసింది. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పారితోషికం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ సినిమా కోసం రణ్ వీర్ ఎన్ని రెమ్యునరేషన్ తీసుకున్నారంటే?

గతంలో విడుదలైన 'ధురంధర్ 1' ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో, దానికి సీక్వెల్‌ గా వచ్చిన ధురంధర్ 2 సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' ఆ అంచనాలను మించేలా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుండటం విశేషం. మొదటి రోజు ఈ సినిమా థియేటర్లలో రూ. 103 కోట్ల వరకు వసూలు చేసింది. ఇది కేవలం భారతదేశవ్యాప్త వసూళ్లు మాత్రమే. ఈ చిత్రాన్ని మొదటి రోజు ప్రత్యేక ప్రదర్శనల ద్వారా కూడా విడుదల చేశారు. దీని ద్వారా రూ. 43 కోట్లు వసూలు కాగా, నివేదిక ప్రకారం మొదటి రోజు మొత్తం వసూళ్లు సుమారు రూ. 172.63 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుంది. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది

Dhurandhar 2 Ranveer Singh Charges Rs 50 Crore Creates Buzz with Record Remuneration

ఇక ఈ సినిమా ఓపెనింగ్స్ బాలీవుడ్‌లోని పలు రికార్డులను కూడా సవాల్ చేస్తున్నాయి. షారుఖ్ ఖాన్ నటించిన 'జవాన్', 'పఠాన్' వంటి చిత్రాల ఫస్ట్ డే రికార్డులకు పోటీగా నిలిచిందని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. అదే సమయంలో సన్నీ డియోల్ నటించిన భారీ సినిమాల ఓపెనింగ్స్‌ను కూడా ఈ సినిమా అధిగమించిందని సమాచారం. దీంతో 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సుమారు రూ.275 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, సాంకేతికంగా కూడా ఉన్నత స్థాయిలో ఉండటం విశేషం. సుమారు 3 గంటల 30 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ కొట్టకుండా కథను నడిపించడంలో దర్శకుడు ఆదిత్య ధర్ సక్సెస్ అయ్యాడని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు, ఉరి దాడి వంటి నిజ జీవిత సంఘటనలను కథలో మేళవించడం సినిమాకు మరింత బలం చేకూర్చాయి.

ఈ తరుణంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలో డబుల్ రోల్‌లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'హంజా అలీ', 'జస్కీరత్ సింగ్ రంగీ' అనే రెండు విభిన్న పాత్రల్లో ఆయన నటన సినిమాకు మెయిన్ హైలైట్‌గా మారింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. రణవీర్ సింగ్ ఈ సినిమాకు సుమారు రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక పారితోషికంగా చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్ట్ కూడా భారీగానే ఉంది. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పోషించిన 'రహమాన్ డకాయిట్' పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాత్ర కోసం ఆయనకు సుమారు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద ఈ సినిమా కోసం నటీనటుల పారితోషికాలు భారీ స్థాయిలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఇక 'ధురంధర్ 2'ను బాక్సాఫీస్ సెన్సేషన్‌గా మారింది. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, ఈ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Read more about: ranveer singh aditya dhar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X