Dhurandhar 2: ‘ధురంధర్ 2' షాకింగ్ రన్ టైమ్.. పాత రికార్డులన్ని బ్రేక్ అయ్యినట్లేనా?
బాలీవుడ్ స్టార్ రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, దర్శకుడు ఆదిత్యధర్ (Aditya Dhar) తెరకెక్కిస్తున్న మూవీ ధురంధర్ 2 (Dhurandhar: The Revenge). ధురంధర్ 1 ఎలాంటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఆ బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా వస్తున్న మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రతి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా ఇప్పుడు 'ధురంధర్ 2' మూవీ రన్‌టైమ్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అప్టేడ్ చూస్తే.. ఈ మూవీ భారతీయ సినీ పరిశ్రమలో నయా రికార్డు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ రికార్డు ఏంటీ?
ధురంధర్ సీక్వెల్‌లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి కనిపించనున్నారు. అలాగే యామీ గౌతమ్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించకపోయినా, సీక్వెల్ అద్భుతంగా ఉందని చెప్పడం అంచనాలను పెంచింది. సినిమాను జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

ఇటీవల వచ్చిన సమాచారం ప్రకారం 'ధురంధర్ 2' నిడివి దాదాపు 3 గంటలు 55 నిమిషాలు అని టాక్ వినిపిస్తోంది. అయితే.. మరికొన్ని కథనాల్లో 3:40 గంటలు ఉంటుందని చెబుతుండగా.. మరికొందరు 3:50 గంటలని ఉంటుందనీ అంటున్నారు. తాజా ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ధురంధర్ 2 రన్ టైమ్ 3:55 గంటల వద్ద లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. అయితే మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు 'అన్‌కట్ వెర్షన్' విదేశాల్లో ఎక్కువ నిడివితో విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నాయి. భారత్‌లో మాత్రం కొంత ట్రిమ్ చేసిన వెర్షన్ (సుమారు 3:40 గంటలు)రావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు గంటల నిడివితో విడుదలైతే, ఇది ఇటీవలి బాలీవుడ్ చరిత్రలో అరుదైన రికార్డుగా నిలువబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ రన్ టైమ్ టాక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్-1కు మించే సీక్వెల్ రన్‌టైమ్ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. ధురంధర్ పార్ట్ 1 సెన్సార్ నుంచి 'A' సర్టిఫికెట్‌తో 3 గంటలు 34 నిమిషాల నిడివితో విడుదల అయ్యింది. ప్రేక్షకులను అద్భుతంగా ఎంగేజ్ చేసింది. ఇలా ఎక్కువ రన్ టైమ్ ఉన్నప్పటికీ ఎక్కడా బోర్ అనిపించకుండా కథనం సాగింది.
అదే మేజిక్ సీక్వెల్‌లోనూ రిపీట్ అయితే, రన్‌టైమ్ పెద్ద సమస్య కాకపోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల కాలంలో ఇంత పెద్ద నిడివితో బాలీవుడ్‌లో సినిమా రావడం అరుదు. 2008లో హృతిక్ రోషన్ నటించిన 'జోథా అక్బర్' 3:50 గంటలు నిడివితో విడుదలైన విషయం తెలిసిందే. తర్వాత ఇలాంటి రన్‌టైమ్‌పై పెద్ద చర్చ రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.
ధురంధర్ మొదటి భాగం భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ధురంధర్ 2పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇండియా-పాకిస్తాన్ నేపథ్యంలోని హై వోల్టేజ్ స్పై డ్రామాగా రూపొందిన ఈ సీక్వెల్ లో భారీ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టు తెలుస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సీక్వెల్ స్టోరీలో భారీ ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం వల్ల రన్ టైమ్ పెరిగినట్టు తెలుస్తోంది.
ధురంధర్ పార్ట్ 1 కేవలం హిందీలోనే విడుదలైంది. అయితే, ఈసారి 'ధురంధర్ 2' తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా డబ్ చేసి పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇది మార్కెట్‌ను విస్తరించే ప్రధాన అంశంగా భావిస్తున్నారు. ఇక ఇదే రోజున విడుదలవుతున్న యష్ నటించిన టాక్సిక్ (Toxic)తో క్లాష్ ఉండటం పోటీని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. ఒకవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్, మరోవైపు మాస్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మార్చి 19 బాక్సాఫీస్ రేస్ హాట్ టాపిక్‌గా మారింది. మార్చి 19న బాక్సాఫీస్ వద్ద ఈ స్పై యాక్షన్ తుఫాను ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











