స్టార్ హీరోకు సెట్‌లో అలాంటి కోర్కెలు... రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన నటుడు
ప్రస్తుత కాలంలో సినిమాల నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతోంది. నటీనటుల రెమ్యునరేషన్ హద్దులు లేకుండా పెంచడంతో పాటు ప్రొడక్షన్ కాస్ట్, పాన్ ఇండియా పిచ్చి సహా ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో సినిమా బడ్జెట్ నియంత్రణలో ఉండటం లేదు. హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించి నిర్మాతలను ఆదుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నా.. ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిర్మాతలను ఆదుకోవాల్సిందిపోయి కొందరు హీరోలు తమ గొంతెమ్మ కోర్కెలతో నిర్మాతలను వేధిస్తున్నారు.
హీరోహీరోయిన్లను ఇతర టెక్నీషియన్లను నిర్మాతలు బుక్ చేసుకునే సమయంలోనే తమకు ఎలాంటి సదుపాయాలు కల్పించాలి? ఏ హోటల్ బుక్ చేయాలి? తమతో పాటు వచ్చే సిబ్బంది ఖర్చు భరించాలని.. తమ కోసం హోటల్‌లో ఫ్లోర్ మొత్తం బుక్ చేయాలని కరాఖండీగా చెబుతున్నారు. తమ డిమాండ్లకు ఒప్పుకోని పక్షంలో అవసరమైతే సినిమాను సైతం వదులుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇలాంటి వారెందరో.

ప్రస్తుతం సినీ పరిశ్రమంలో కేరవాన్ కల్చర్ బాగా ఎక్కువైంది. గతంలో నటీనటులంతా షాట్ గ్యాప్‌లో ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఔట్‌డోర్‌కి వెళ్లినప్పుడు స్టార్స్ ఇబ్బంది పడకుండా సకల సదుపాయాలతో కూడిన కేరవాన్‌లు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. నటీనటుల స్థాయిని బట్టి ఈ వానిటీ వ్యాన్లను నిర్మాతలే ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా షూటింగ్ సెట్‌కు వెళితే.. టూరిస్ట్ బస్సుల మాదిరిగా పదుల సంఖ్యలో కేరవాన్‌లు బారులు తీరుతున్నాయి. షూటింగ్‌లో తమ వంతు వచ్చే వరకు వ్యాన్‌లో వెయిట్ చేయడం.. షాట్ అవ్వగానే నేరుగా వ్యాన్‌లో రెస్ట్ తీసుకోవడంతో నటీనటుల మధ్య గతంలో మాదిరిగా సంబంధాలు ఉండటం లేదు.
తాజాగా ఓ స్టార్ హీరో వానిటీ వ్యాన్‌ల వ్యవహారం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్. ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ మూవీ ధురంధర్‌తో ఇండస్ట్రీలో రికార్డులో తిరగరాశారు రణ్‌వీర్. ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో బాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 50 రోజులు కావొస్తున్నా ధురంధర్ హవా నేటికీ తగ్గడం లేదు. ఈ సినిమా సక్సెస్‌తో పార్ట్ 2పై అంచనాలు తారాస్థాయికి పెరిగిపోయాయి. అయితే ధురంధర్ షూటింగ్‌లో రణ్‌వీర్ సింగ్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ సినిమాకు గాను రణ్‌వీర్ నిర్మాతల ద్వారా మూడు వానిటీ వ్యాన్‌లను తెప్పించారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి రణ్‌వీర్‌కు, రెండోది ఆయన స్టాఫ్ కోసం, మూడోది అదనంగా ప్రత్యేక అవసరాల నిమిత్తం అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ధురంధర్ ఎండ్ క్రెడిట్స్‌లో వెండర్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూకు కేటాయించిన వానిటీ వ్యాన్‌ల వివరాలు ప్రస్తావించారు.
అందులో హమ్జా వాన్, హమ్జా స్టాఫ్ వాన్, హమ్జా నార్మల్ వాన్ అనే పేర్లతో మూడు వ్యాన్‌లను హీరో రణ్‌వీర్ సింగ్‌కు కేటాయించినట్లు స్పష్టంగా ఉంది. దాంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ధురంధర్‌లో నటనకు గాను ప్రశంసలు దక్కించుకున్న ఆయన.. సౌకర్యాల పేరుతో నిర్మాతకు అదనపు ఖర్చు మిగిల్చారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారగా.. దీనిపై రణ్‌వీర్ అతని టీమ్ స్పందించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











