twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్'లో ఆ డైలాగ్ సెన్సార్ కట్?

    By Srikanya
    |

    మహేష్ బాబు తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ లో బాగా పాపులర్ అయ్యిన డైలాగు..ముంబైని ఉచ్చ పోయించటానికి వచ్చాను అనేది..ఈ డైలాగుని సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పి కట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి విడుదల అయ్యే ఈ చిత్రంలో ఈ డైలాగు ఉండదని ఫిల్మ్ సర్క్లిల్స్ లో చెప్పుకుంటున్నారు. దానికి కారణంగా..ముంబైని ఉద్దేశించి అన్న ఈ డైలాగు...అక్కడి వారి మనో భావాలు దెబ్బతినే అవకాశం ఉండటం వల్ల తొలిగించాల్సి వచ్చిందని చెప్పారని చెప్తున్నారు. అయితే ఇది అఫీషియల్ గా చెప్పే కన్ఫర్మ్ న్యూస్ మాత్రం కాదు.

    ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా చేస్తోంది. సంక్రాంతిక కానుకగా ఈ చిత్రం ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం 16 వందల థియేటర్లలో విడుదలవుతోంది. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది. ఓ భాయ్‌ని చంపడానికి ఓ పోలీసు అధికారి చేసిన ప్రయత్నం 'పోకిరి'. ఏకంగా భాయ్‌ అవుదామని రంగంలోకి వచ్చిన ఓ యువకుడి కథ 'బిజినెస్‌మేన్‌'.

    English summary
    Mahesh Babu dialogue in Businessman have not found favor with the Censor Board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X