బాలీవుడ్ బ్యూటీ పై మోజుపడ్డ అభిషేక్.. అందుకేనా ఐశ్వర్యకు విడాకులు!
Aishwarya Rai - Abhishek Bachchan divorce: బాలీవుడ్ మోస్ట్ బ్యూటీ కపుల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్. ఈ స్టార్ కపుల్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీరిద్దరి జోడికి ప్రేక్షకులలో మంచి ఆదరణ వచ్చింది. వీరి వివాహం జరిగి దాదాపు దశాబ్దం కాలానికి పైగా ఎంతోసంతోషంగా ఉన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా పుట్టింది. ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ అసలు విమర్శలకు తావివ్వకుండా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ అలాంటి ఈ జంటపై గత కొద్ది నెలలుగా విడాకుల రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా మరో ఈ విషయం వార్తల్లో నిలిచింది.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లు 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఆరాధ్య అనే పాప పుట్టింది. గత 16 ఏండ్లుగా వీరి కాపురం బాగానే సాగినా గత కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా అభిషేక్- ఐశ్వర్యరాయ్ విడాకులు తీసుకుంటున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. తాము కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ ఎంత చెబుతున్నప్పటికి ఈ రుమర్లు మాత్రం ఆగడం లేదు.

ఇటీవల అనంత అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లిలో సమయంలో కూడా అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యరాయ్ విడాకుల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఐశ్వర్య తన కూతురు ఆద్యతో కలిసి హాజరవగా.. అభిషేక్ బచ్చన్ మాత్రం తన తల్లిదండ్రులతో కలిసి హాజరయ్యారు. పైగా ఈ వేడుకల్లో హీరో అమితాబచ్చన్ మాజీ ప్రేయసి రేఖతో ఐశ్యర్య చనువుగా వ్యవహరించిందంట. ఈ విషయం బచ్చన్ కుటుంబ సభ్యులకు నచ్చలేదని వార్తలు వినిపిస్తాయి.
అంతకు ముందు ఐశ్యర్య విదేశాలకు వెళ్లి .. ఇండియాకి వచ్చినప్పుడు కూడా బచ్చన్ ఫ్యామిలీ నుంచి కూడా ఎవరూ రాకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వినిపించాయి. ఇదే కాదు.. కొద్ది రోజుల క్రితం ఐశ్వర్యరాయ్ తన చైల్డ్ వుడ్ ఫ్రెండ్ ని ప్రేమిస్తుందని, అతనిపై మోజుతో వివాహం చేసుకోవాలని అనుకుంటుందని, అందుకే హీరో అభిషేక్ విడాకులు ఇవ్వబోతుందనే రూమర్స్ వచ్చాయి. కానీ, ఇందులో ఎటువంటి నిజం లేదు. తామిద్దరం కలిసే ఉన్నామని విడాకులు తీసుకోవడం లేదని ఐశ్వర్యరాయ్ మరియు అభిషేక్ లు క్లారిటీ ఇస్తూ ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పటికి ఈ పుకార్లు మాత్రం ఆగడం లేదు.

అయితే ఇప్పుడు తాజాగా మరో రూమర్ తెరపైకి వచ్చింది. ప్రముఖ హీరో అభిషేక్ బచ్చన్.. ఓ హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల తాను నటించిన దస్వి సినిమాలో హీరోయిన్ గా నటించిన నిమ్రత్ కౌర్ తో ఆయన రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బ్యూటీపై మోజుపడి తన భార్య ఐశ్వర్యరాయ్ కి విడాకులు ఇవ్వబోతున్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. అభిషేక్-ఐశ్వర్య విడాకులపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా ఈ వార్త మాత్రం ఇప్పుడు షికార్లు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











