ఇమ్రాన్ పార్టీలో రెచ్చి పోయిన షాహిద్-అనుష్క?
బాలీవుడ్ మూవీ బద్మాస్ కంపెనీలో కోస్టార్స్ గా నటించిన షాహిద్ కపూర్-అనుష్క శర్మ మధ్య అప్పటి నుంచే 'సం"బంధం ఉందనే వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలు నిజం చేసేలా ఓ సంఘటన చోటు చేసుకుందట. అమీర్ ఖాన్ అల్లుడు ఇమ్రాన్ ఖాన్ నటించిన 'మేరే బ్రదర్ కి దుల్హన్" సినిమా సక్సెస్ అయిన నేపథ్యంలో ఇమ్మాన్ తన తోటి నటులకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి వచ్చిన షాహిద్-అనుష్కశర్మ గాఢమైన రొమాన్స్ లో మునిగి లిప్ లాక్ ముద్దులతో ఎంజాయ్ చేశారని ఓ ఇంగ్లీష్ డెయిలీ వార్త ప్రచురించింది. అయితే షాహిద్ కపూర్ మాత్రం ఈవార్తలను ఖండించారు. అదంతా సదరు పత్రిక విలేఖరి రాసిన ఊహాత్మక కట్టుకథ అని తన ట్విట్టర్ ద్వారా కొట్టి పారేశారు.
ఈ విధంగా ఆధారాలు లేకుండా కథనాలు ఎందుకు రాస్తారో అర్థం కాదు..అందుకే ఒక్కోసారి మీడియా వాళ్లంటేనే కోపంగా ఉంటుందని తన ట్విట్టర్ లో మండి పడ్డారు. పార్టీలో క్లోజ్ గా మెలిగినంత మాత్రాన ఉన్నవి లేనివి కలిపి రాసేయడమేనా..? మీ యొక్క సర్క్యులేషన్ పెంచుకునేందుకు మమ్మల్ని ఎందుకు బదనాం చేస్తారు? అంటూ చిటపటలాడారు. ఇదిలా ఉంటే...చేసిందంతా చేసి బండారం బయట పడ్డాక షాహిద్ బుకాయింపు మొదలు పెట్టాడని మరికొందరు వాదిస్తుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











