డిస్ట్రిబ్యూటర్‌పై చేయి చేసుకున్న బెల్లంకొండ సురేష్.. మ్యాటర్ వేడెక్కడంతో?
బడా నిర్మాతలని మినహాయిస్తే.. చిన్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చిత్ర పరిశ్రమలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. సినిమా కోసం జీవితాలనే పణంగా పెట్టి పెట్టుబడి పెడతారు. వారి సినిమా విజయం సాధిస్తే ఓకె.. లేకుంటే బయ్యర్ల జీవితాలు కూడా తిరగబడ్డ సందర్భాలు ఉన్నాయి. సినిమా నిరాశపరిచినప్పుడు ముందుగా ఎక్కువ నష్టం వాటిల్లేది డిస్ట్రిబ్యూటర్లకే. చాలా చిత్రాల వలన దారుణంగా నష్టపోయిన బయ్యర్లు తమని ఆదుకోవాలని నిర్మాతల వెంట పడ్డ సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఘటనే ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ విషయంలో జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరోమారు వార్తల్లో
బెల్లంకొండ సురేష్ గతంలో కొన్ని వివాదాల విషయంలో వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ కేంద్రంగా మరో వివాదం మొదలైంది. ఓ డిస్ట్రిబ్యూటర్ తో ఆర్థికపరమైన చర్చలు జరుగుతుండగా తీవ్రమైన వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సురేష్ సహనం కోల్పోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఓ చిత్రానికి సంబంధించిన ఆర్థికపరమైన వ్యవహారంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

చేయి చేసుకున్న వైనం
ఆర్థిక పరమైన వివాదం తీవ్రంగా మారడంతో అక్కడి వాతావరణం అదుపు తప్పిందట. దీనితో ఒక్కసారిగా సురేష్ సదరు డిస్ట్రిబ్యూటర్ ని కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ వివాదం ఎపుడు, ఎక్కడ జరిగింది అని సినీవర్గాలు ఆరాతీయడం ప్రారంభించాయి. తన ప్రతిష్టని దిగజార్చేలా వస్తున్న వార్తలపై సురేష్ స్పందించారు. డిస్ట్రిబ్యూటర్ ని కొట్టినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని ఖండించారు.

చిన్న వాదన మాత్రమే
ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఇవి చెత్త వార్తలు.. నేనంటే గిట్టని వాళ్ళే ఇలాంటి రూమర్స్ సృష్టిస్తారు అని సురేష్ అన్నారు. తనకు, డిస్ట్రిబ్యూటర్ కు మధ్య జరిగింది చిన్న వాదన మాత్రమే అని సురేష్ అన్నారు. ఎవరినో నేను ఎందుకు కొడతాను ? అవతలి వ్యక్తితో ప్రశాంతంగా చర్చ జరుగుతున్నప్పుడు కొట్టాల్సిన అవసరం ఏముంది అని సురేష్ అన్నారు.

ఎన్నో హిట్ చిత్రాలు
బెల్లంకొండ తనకెరీర్ లో ఎన్నో బడా చిత్రాలు నిర్మించారు. లక్ష్మి నరసింహ, ఆది, అల్లుడు శీను, కందిరీగ లాంటి చిత్రాలని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస్ తాజాగా నటించిన కవచం చిత్రం ఇటీవల విడుదలయింది. శ్రీనివాస్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











