చిరంజీవి సినిమాకు హానీ రోజ్ నో.. అసలు కారణమేంటి?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో అవకాశం రావడమంటేనే చాలా మంది నటీనటులకు డ్రీమ్ ఆఫర్‌లా భావిస్తారు. ఆ అవకాశం కోసం ఇతర సినిమాలను కూడా వదులుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు. అదే సమయంలో చిరుతో నటించే అవకాశం రావాలని ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే. అలాంటి గోల్డెన్ ఆఫర్ ను హాట్ బ్యూటీ హనీ రోజ్ వదులుకుందట. అసలేం జరిగిందంటే?

మెగాస్టార్ చిరంజీవి , మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'Mega158' ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో గతంలో 'వాల్తేరు వీరయ్య' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించడంతో, ఈ సరికొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.

Did Honey Rose Walk Away from Chiranjeevi s Mega158 Industry Buzz Goes Viral

చిరు 158వ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ నటి హనీ రోజ్‌ను మూవీ మేకర్స్ సంప్రదించారట. అందుకు ఆ అమ్మడు కూడా మొదట ఈ ప్రాజెక్ట్‌కు అంగీకరించి, అడ్వాన్స్ తీసుకుందట. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఆ సినిమా నుంచి తప్పుకుందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, చాలా చిన్న వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. మలయాళం, తమిళం భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తెలుగులో 'ఆలయం', 'ఈ వర్షం సాక్షిగా' వంటి చిత్రాల్లో కనిపించినప్పటికీ, ఆ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి.

అయితే 2023లో విడుదలైన నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' సినిమాతో హనీ రోజ్ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. బాలయ్య సరసన ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్, సంప్రదాయ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమాలో కూడా హనీ రోజ్‌కు కీలక పాత్ర ఆఫర్ వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపిన ఆమె మొదట ఓకే చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నారని, తర్వాత షెడ్యూల్ సమస్యలు, ఇతర కమిట్‌మెంట్ల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, తీసుకున్న అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఇక్కడితో ఈ వ్యవహారం ఆగలేదు. హనీ రోజ్ అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడం వెనుక మరికొన్ని కారణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. కొందరు ఇది కేవలం డేట్స్ క్లాష్ మాత్రమేనని అంటుండగా, మరికొందరు ఇతర ప్రాజెక్ట్‌లకు ప్రాధాన్యత ఇవ్వడమే కారణమని చెబుతున్నారు. మరోవైపు ఓ సీనియర్ నటుడు ఆమె నిర్ణయంపై ప్రభావం చూపించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వార్తలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.ఈ విషయంపై క్లారిటీ రావాలంటే చిత్రబృందం లేదా హనీ రోజ్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X