సీక్రెట్‌గా కంగన రనౌత్ పెళ్లి? అలా షాకిచ్చిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్!

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మేల్ డామినేషన్ ఎక్కువగా ఉండే సినీరంగంలో.. అందులోనూ బాలీవుడ్‌లో తనదైన నటనతో, వ్యక్తిత్వంతో గుర్తింపు తెచ్చుకున్నారు కంగనా. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు పొందారు. ఇక చిన్న వయసులోనే ఎంపీగా గెలిచి మరో ఘనతను అందుకున్నారు. అయితే గత కొంతకాలంగా కంగనా రనౌత్ పెళ్లి గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇదే వ్యవహారానికి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సుడిగాలి సుధీర్? కాబోయే భార్య ఎవరంటే?

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కంగనా రనౌత్ తన 15వ ఏటనే ఇంట్లో నుంచి పారిపోయి మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ఇక్కడ సత్తా చాటుతూనే సినీరంగంలో ఎంట్రీ ఇచ్చి 2006లో గ్యాంగ్‌స్టర్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం వోహ్ లమ్హే, లైఫ్ ఇన్ ఏ మెట్రో, ఫ్యాషన్ సినిమాలతో సంచలనం సృష్టించారు. ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, కరీనా కపూర్ వంటి టాప్ స్టార్స్ నుంచి పోటీ వస్తున్నా తట్టుకుని నిలబడ్డారు. తను వెడ్స్ మను, కైట్స్, నాక్ ఔట్, గేమ్, రెడీ, క్రిష్ 3 తదితర సినిమాలతో బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. సినీ రంగానికి అందించిన సేవలకు గాను చిన్న వయసులోనే భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డ్‌ను అందుకున్నారు.

Did Kangana Ranaut Secretly Get Married Viral Video Sparks Fresh Buzz

అందరు హీరోయిన్ల మాదిరిగానే కంగనా రనౌత్‌పైనా పలుమార్లు రూమర్స్ వినిపించాయి. తొలినాళ్లలో ఆదిత్య పంచోలి, ఆధ్యయన్ సుమన్, అజయ్ దేవగణ్‌, హృతిక్ రోషన్‌లతో ఆమె ప్రేమాయణం సాగించినట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక అన్నింటిలోకి హృతిక్ రోషన్‌, ఆదిత్య పంచోలిలతో డేటింగ్ వ్యవహారం కోర్టు నోటీసుల దాకా వెళ్లింది. క్రిష్ 3 సినిమా సమయంలో ఏర్పడిన పరిచయంతో హృతిక్ రోషన్, కంగన మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ కొన్నాళ్ల పాటు డేటింగ్ చేయగా.. అనివార్య కారణాలతో ఈ జంట విడిపోయింది. అయితే హృతిక్‌ను ఉద్దేశించి పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది కంగన.

Recommended For You
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’
'నేనేమీ బ్రేక్ తీసుకోలేదు.. అలా సినిమాలకు దూరమయ్యా’

తొలి నుంచి బీజేపీకి గట్టి మద్ధతుదారుగా ఉన్న కంగనా రనౌత్ 2024 ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే కంగనా రనౌత్ వివాదాల్లో నిలిచారు. శివసేనతో గొడవతో పాటు ఎంపీగా గెలిచిన తొలినాళ్లలో చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో మహిళా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చేతిలో చెంపదెబ్బ వంటి వ్యవహారాలు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా బ్యాచిలర్‌గానే ఉంటున్నారు కంగనా రనౌత్. అయితే ఆమె పెళ్లిపై మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కంగనా రనౌత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వచ్చిన వార్తలు కలకలం రేపాయి. తాజాగా ఆమె వివాహానికి సంబంధించి మరో వార్త వైరల్ అవుతోంది.

You May Also Like
'అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం’
'అర్ధరాత్రి 3 గంటలైనా నాకే ఫోన్.. త్రిషకు నేనంటే ప్రాణం’

కంగనా రనౌత్ తన భద్రతా సిబ్బందితో కలిసి ఓ ఇంట్లో నుంచి వస్తున్న వీడియో కలకలం రేపింది. ఆ వీడియోలో కంగనా తన చేతికి మట్టి గాజులతో పాటు మెడలో నల్లపూజల దండ ధరించి ఉంది. సాధారణంగా హిందూ సాంప్రదాయంలో పెళ్లయిన స్త్రీలు ధరించే మాదిరిగా నల్లపూసల దండ, చేతికి మట్టిగాజుల్ని ధరించి కనిపించడంతో కంగనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? భర్త ఎవరు? మెడలో ఉన్న మంగళ సూత్రం వెనుక కారణం ఏంటీ? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన హిట్ మూవీ క్వీన్‌కి సీక్వెల్‌గా క్వీన్ 2లో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసమే ఇలా రెడీ అయ్యారంటూ మరో వాదన వినిపిస్తోంది. మరి నిజంగానే కంగనా పెళ్లి చేసుకుందా? లేక సినిమా కోసమే ఇలా తయారయ్యారా? అన్న దానిపై క్లారిటీ రావాలంటే కంగనా స్పందించాల్సిందే.

Read more about: kangana ranaut movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X