టాలీవుడ్‌లో సంచలనం.. పాన్ ఇండియా మూవీ నుంచి ప్రకాష్‌రాజ్ ఔట్?
ప్రకాష్‌రాజ్... నటనకే భాష్యం చెప్పిన మహానటుల్లో ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయం ప్రవేశం చేసే అరుదైన నటుడు. నాలుగు దశాబ్ధాలుగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. హీరోగా, విలన్‌గా, తండ్రిగా, సహాయ నటుడిగా మెప్పించారు. ఆయన ఏ పాత్ర పోషించినా పాత్రే కనిపిస్తుంది తప్పించి ప్రకాష్‌రాజ్ కనిపించరంటే అతిశయోక్తి కాదు. అంతలా పాత్రలకు ప్రాణం పోస్తారు ప్రకాష్. 60 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తగ్గకుండా బిజీగా ఉంటున్నారు. దక్షిణాదితో పాటు హిందీలోనూ మోస్ట్ వాంటేడ్ నటుడిగా కొనసాగుతున్నారు ప్రకాష రాజ్. అలాంటిది ఓ పాన్ ఇండియా సినిమా నుంచి ఈ దిగ్గజం తప్పుకున్నట్లుగా వార్తలు వస్తుండటంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ఈ వివరాల్లోకి వెళితే..
రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రకాష్ రాజ్.. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రైటర్‌గా సత్తా చాటారు. దర్శక దిగ్గజం కే బాలచందర్ దర్శకత్వంలో నటుడిగా పరిచయం అయిన ప్రకాశ్‌రాజ్‌కు గొప్ప పాత్రలు దొరికాయి. రఘువరన్, కోట శ్రీనివాసరావు వంటి దిగ్గజాల శకం ముగిసిన తర్వాత వారి స్థానాన్ని ప్రకాష్‌రాజ్ భర్తీ చేశారు. పలు భాషల్లో అనేకమంది దర్శకులు ప్రకాష్ రాజ్ కోసమే ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారు. వీటిని ఆయన అద్భుతంగా పోషించేవారు. ప్రకాష్‌రాజ్ నటించిన చిత్రాలన్నీ వేటికవే ప్రత్యేకం.

ప్రకాశ్‌రాజ్ నటనకు ఫిలింఫేర్, నంది, జాతీయ చలన చిత్ర పురస్కారాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఏరీ కోరి వరించాయి. తనను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో తనకు చేతనైన సాయం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండరెడ్డి పల్లె గ్రామాన్ని దత్తత తీసుకుని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అలాగే కరోనా సమయంలో వలస కూలీలకు తన ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం కల్పించారు. సినిమాలతో పాటు వివాదాల్లోనూ చిక్కుకుని విమర్శల పాలయ్యారు ప్రకాష్‌రాజ్. సమకాలీన అంశాలు, రాజకీయాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ప్రస్తుతం ప్రకాష్‌రాజ్ తమిళంలో నటించిన జననాయగన్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది కాకుండా తెలుగులో జీ2, డెకాయిట్, వారణాసి, స్పిరిట్, తత్వమసితో పాటు తమిళంలో మిరాకిల్, కన్నడంలో ఫాదర్ సినిమాలలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు, పాన్ ఇండియా సినిమాలు కావడం విశేషం. ఇవి కాకుండా మరికొన్ని ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. ఆయన కాల్షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతూనే ఉన్నారు. అలాంటి ఓ పాన్ ఇండియా సినిమా నుంచి ప్రకాష్‌రాజ్‌ను తప్పించినట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా సినిమాను డైరెక్ట్ చేస్తోన్న దర్శకుడితో సెట్‌లోనే ప్రకాష్‌రాజ్‌కు గొడవ జరిగిందని.. ఇది కాస్తా వివాదంగా మారినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిని సీరియస్‌గా తీసుకున్న మేకర్స్.. ప్రకాష్‌రాజ్‌ను ఈ సినిమా నుంచి తప్పించినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రకాష్‌రాజ్ ప్రస్తుతం తెలుగులో పలు పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో స్పిరిట్, డెకాయిట్, వారణాసి. వీటిలో డెకాయిట్ షూటింగ్ ఆల్‌మోస్ట్ పూర్తి కాగా.. వారణాసిలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నారు ప్రకాష్. ఇక మిగిలింది స్పిరిట్ మాత్రమే.
ఈ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నట్లుగా జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వర్క్ కూడా మొదలైంది. సోషల్ మీడియా జనాలు మాత్రం స్పిరిట్ నుంచే ప్రకాష్‌రాజ్‌ను తప్పించినట్లుగా రాసుకొస్తున్నారు. అయితే ఈ మూడు సినిమాల్లో దేని నుంచి ఈ విలక్షణ నటుడిని తప్పించారన్న దానిపై గందరగోళం నెలకొంది. ఇంతకీ ఈ వార్త నిజమేనా? లేక గాలివార్తా? అన్నది మాత్రం తెలియరాలేదు. దీనిపై ప్రకాష్‌రాజ్ స్పందిస్తేనే ఊహాగానాలకు చెక్ పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











