Mamita Baiju: మమిత బైజు ప్రేమలో పడిందా? ఒక్క పోస్ట్ తో హింట్ తేల్చేసిన బ్యూటీ!
హీరోయిన్లు ఎప్పుడే బాంబు పేలుస్తారో తెలియక ప్రేక్షకులు , సినీ పరిశ్రమ టెన్షన్ పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం హీరోయిన్ కీర్తి సురేష్ తమ 15 ఏళ్ల ప్రేమ బంధాన్ని బయటపెట్టడంతో పాటు ఏకంగా మూడు ముళ్లు వేయించుకుని షాకిచ్చింది. సినిమాల్లోకి రాకముందే పలువురు ముద్దుగుమ్మలు రిలేషన్‌లో ఉంటున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొందరు ప్రేమలో పడుతున్నారు. సడెన్‌గా తమ రిలేషన్‌ను బయటి పెట్టి అభిమానులకు షాకిస్తున్నారు.
జీవితం మారిపోవడానికి ఒక్క ఛాన్స్ చాలు అన్నట్లు .. సినిమా వాళ్లకు ఒక్క సినిమా చాలు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి స్టార్లుగా వెలుగొందిన వారు కొందరైతే, ఒకే ఒక్క సినిమా అట్టర్ ఫ్లాప్‌తో అడ్రస్ లేకుండా పోయిన వారు ఎందరో. అలా ఒకే ఒక్క సినిమాతో మాయ చేసి కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తున్నారు మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు. ప్రేమలు సినిమా సంచలన విజయం సాధించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది.

తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతకు గిలిగింతలు పెట్టింది. ప్రేమలు సినిమా తర్వాత ఆమె పాత వీడియోలు, రీల్స్, డ్యాన్స్ క్లిప్పులు ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వస్తున్నాయి. మమిత డ్రెస్సింగ్ స్టైల్ , హెయిర్ స్టైల్‌కు ఫిదా అయిన అమ్మాయిలు ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టడంతో సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు. అయితే ఇదంతా కేవలం ఒక్క సినిమాకే సుమా.
మోడ్రన్, ట్రెండీ వేర్ ధరించకుండా ఎక్కువగా సాంప్రదాయ దుస్తుల వైపే మొగ్గు చూపడం కూడా యువతకు ఆమె పట్ల మంచి అభిప్రాయం వచ్చేలా చేసింది. నిజానికి ప్రేమలు ఆమె తొలి చిత్రం కాదు.. అది మమితకు 16వ సినిమా. 2017లోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె 18 చిత్రాల్లో నటించగా.. ప్రేమలుతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆపరేషన్ జావా, ఖో ఖో, సూపర్ శరణ్య, ప్రణయ విలాసం సినిమాలతో తనలోని నటిని పరిచయం చేసింది.
అంతేకాదు స్టార్ హీరోయిన్స్‌ను కూడా వెనక్కి నెట్టి ప్రతిష్టాత్మక '' ఓర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ (మలయాళం) జాబితాలో ఈ చిన్నది అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం విష్ణు విశాల్ సరసన వీవీ 21లో, ఇళయ దళపతి విజయ్ నటిస్తోన్న జన నాయగన్ చిత్రంలోనూ మమిత అవకాశం అందుకుంది.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మమితా బైజు తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో ఓ కుర్రాడితో క్లోజ్‌గా ఉన్న మమితా అతనితో టీ తాగుతూ.. ఐస్ క్రీమ్ తింటూ, బస్సులో వెళ్తూ కనిపించింది. నా ప్రాణ స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నువ్వు నాకు అత్యుత్తమ స్నేహితుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా జీవితంలోకి అనుకోకుండా సరైన సమయంలో వచ్చిన అరుదైన రత్నానివి అంటూ లవ్ ఎమోజీని షేర్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మమిత ప్రేమలో పడిందా? ఈ రకంగా హింట్ ఇచ్చిందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మమిత యవ్వారం చూస్తుంటే త్వరలోనే అసలు మేటర్ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.


Click it and Unblock the Notifications











