twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ జెండాకు రామ్ చరణ్ అవమానం.. చిక్కులు తప్పవా, అసలు ఏమైంది?

    |

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ జాతీయ జెండాను అవమానించారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. అయితే ఆయన ఉద్దేశం పూర్వకంగా జాతీయ జెండాను అవమానించ లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. అసలు ఏం జరిగింది ? ఎందుకు ఈ వివాదం మొదలైంది అనే విషయంలోకి వెళితే

    ఆర్ఆర్ఆర్ తో

    ఆర్ఆర్ఆర్ తో

    చివరిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామ్ చరణ్ తేజ ఆ సినిమా తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన వెంటనే చాలా గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తీసుకున్న తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి ఆయన హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి రామ్ చరణ్ ఈ సినిమా కాకుండా తన తండ్రి హీరోగా నటిస్తున్న ఆచార్య అనే సినిమాలో కూడా ఒక కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

    బిజీ బిజీ

    బిజీ బిజీ

    అపజయమే ఎరుగని దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ నటిస్తుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. నిజానికి ముందు రామ్ చరణ్ పాత్ర చిన్నదే అనుకున్నారు కానీ నెమ్మదిగా రామ్ చరణ్ పాత్ర నిడివి కూడా పెరిగిపోయింది. దీంతో ఆయన ప్రస్తుతం రెండు మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తున్నట్టు కనిపిస్తోంది ఆయన ఫ్యాన్స్ కి. ఆ సంగతి పక్కన పెడితే ఈ రెండు సినిమాలు అయిన వెంటనే ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా మొదలు పెట్టబోతున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ప్రస్తుతం ఉక్రెయిన్ దేశంలో ఉన్నారు.

    అవమానం ఎలా అంటే

    అవమానం ఎలా అంటే

    ఆ దేశంలో ఉన్న ఆయన జాతీయ జెండాను ఎలా అవమానిస్తారు అని అనుమానం కలగడం సహజం. అయితే రామ్ చరణ్ తేజ్ ఇతర హీరోల రాగానే కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందులో హ్యాపీ మొబైల్స్ అనే సంస్థ కూడా ఒకటి.. ఈ సంస్థకు ప్రమోటర్ గా రామ్ చరణ్ తేజ కొంత రెమ్యునరేషన్ తీసుకుని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే అసలు సంగతి ఏమిటంటే ఆ సంస్థ రేపు భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఫుల్ పేజీ యాడ్ లు కొన్ని పేపర్లకి ఇచ్చింది. ఈ ఫుల్ పేజీ యాడ్ లో భాగంగా రామ్ చరణ్ పూర్తిగా తెల్లటి దుస్తుల్లో కనిపిస్తూ జాతీయ జెండా ఎగర వేస్తున్నట్లుగా ఫోటో ఒకటి వచ్చింది. అయితే ఇందులో అశోకచక్రం కనిపించకపోవడంతో రామ్ చరణ్ తేజ్ జాతీయ జెండాను అవమానించేలా జెండాని పట్టుకున్నారని కొందరు కామెంట్లు పెడుతున్నారు.

    Recommended Video

    Upasana Konidela Redefines Chiranjeevi's Age With Bpositive Cover | Syeraa Narasimha Reddy
     అదేం నేరం కాదు

    అదేం నేరం కాదు

    వాస్తవానికి 2002 జాతీయ జెండా చట్టం ప్రకారం ఇలా అశోక చక్రం లేకుండా జెండా ఉండడం అనేది తీవ్ర నేరమని చెప్పాలి. అయితే ఇలా ఎందుకు వాడాల్సి వచ్చింది అనే దాని మీద కంపెనీ స్పందిస్తూ సాధారణంగా ఇలా వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడటం అనేది నేరమని అలా చేయడం సరికాదని చెప్పుకొచ్చింది. కానీ ఇలా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేటప్పుడు జాతీయ జెండాను పోలి ఉండేలా త్రివర్ణ పతాకాన్ని మాత్రమే వాడుకోవచ్చని అశోక చక్రం లేదు కాబట్టి జాతీయ జెండా కాదు అని కానీ జాతీయ జెండా లాగానే అనిపిస్తుంది కాబట్టి అలా వాడామని చెప్పుకొచ్చింది. అలా చేయడమేమీ నేరం కాదని కూడా సదరు సంస్థ వాదిస్తోంది. సో ఇదేమీ పెద్ద ఇబ్బంది కాదని, అవమానించడం కూడా కాదని క్లారిటీ వచ్చినట్టయింది.

    నో క్లారిటీ

    ఇక రామ్ చరణ్ తేజ- శంకర్ కాంబినేషన్ సినిమా పూర్తయిన వెంటనే చాలా మంది దర్శకులతో పని చేస్తారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. అయితే ఇప్పటిదాకా ఆయన ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా ఫలానా దర్శకుడితో రామ్ చరణ్ సినిమా రాబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడం మాత్రం కామన్ అయిపోయాయి. ఇక రామ్ చరణ్ తేజ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరితో సినిమా చేయబోతున్నారు అనే దాని మీద ఎవరూ ఏమీ మాట్లాడ లేని పరిస్థితి. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో లోనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక విడుదల కావాలి విడుదలయ్యాక రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ సినిమా మొదలు కావాలి అది పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆయన మరో సినిమా గురించి ఆలోచించే అవకాశం ఉందని కూడా రామ్ చరణ్ సన్నిహిత వర్గాల వారు అంటున్నారు. ఇక ఇప్పట్లో రామ్ చరణ్ నుంచి కొత్త ప్రకటన అంటే పెద్దగా ఏమీ వెలువడే అవకాశాలు లేవని అంటున్నారు.

    English summary
    Mega power star Ram Charan Teja has been accused of insulting the national flag. What actually happened?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X