twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చిత్రం ‘హైపర్‌’ కథ, ఫిల్మ్ సర్కిల్స్ ఇన్ సైడ్ టాక్ ఏంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : రామ్‌, డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో వెంకట్‌ బోయినపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

    ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రేపు...( సెప్టెంబర్ 30న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ అంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక కథ ప్రచారంలోకి వచ్చింది. ఆ కథని మీకు అందిస్తున్నాం. అదే కథతో సినిమా తీసారా...లేక ఎవరైనా ట్రైలర్స్, ఫస్ట్ లుక్ చూసి అల్లిసారా అనే విషయాలు తెలియాలంటే రేపు సినిమా చూసి తేల్చుకోవాల్సిందే.

    అప్పట్లో ఇంట్రెస్టింగ్ స్కీన్ ప్లేతో, అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ తో 'కందిరీగ' టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టైపోయింది. ఈ సినిమా తీసుకొచ్చిన క్రేజ్ తో సంతోష్ శ్రీనివాస్ కు యన్టీఆర్ తో 'రభస' ఛాన్సొచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయినా సరే అతడి మీద కాన్ఫిడెన్స్ తో సంతోష్ కి మరో ఛాన్సిచ్చాడు 'రామ్'. సినిమా పేరు 'హైపర్'. ఈ సినిమా తో 'రామ్' మరోసారి మాస్ అవతారంలో అలరించబోతున్నాడు.

    చిత్రం కథ ని, ఇన్నర్ టాక్ ని మీరు క్రింద చదవచ్చు....

    ఫాధర్ గవర్నమెంట్ ఎంప్లాయి...

    ఫాధర్ గవర్నమెంట్ ఎంప్లాయి...

    ఇప్పటికే ప్రచారం అవుతున్నట్లుగా ఈ చిత్రం తండ్రి నారాయణ మూర్తి (సత్యరాజ్) , కొడుకు (రామ్ ) చుట్టూ తిరుగుతుంది. రామ్ కు తండ్రంటే పిచ్చ ప్రేమ. తన తండ్రి మీద ఈగ వాలినా యుద్దం చేసేస్తాడు. తండ్రి సత్యరాజ్... ఓ నిజాయితీ గల గవర్నమెంట్ ఉద్యోగి. ఫస్టాఫ్ లో ఆఫీస్ సీన్స్, తండ్రి కొడుకుల మధ్య సీన్స్ వస్తాయి.

    అందుకే అలా పెట్టారు

    అందుకే అలా పెట్టారు

    అందుకే అలా పెట్టారుసినిమాలో రామ్ పాత్ర పేరు సూర్య. తండ్రి పాత్ర పేరు నారాయణ. తండ్రిపై వున్న ప్రేమతో తన పేరును సూర్యనారాయణగా మార్చుకుంటాడు. సూర్య పాత్ర చాలా హైపర్‌గా వుంటుంది. ప్రతి కుటుంబంలోనూ ఇలాంటి వాడు ఒకడు ఉంటాడు. అందుకే టైటిల్‌కు ఉపశీర్షికగా ప్రతి ఇంట్లోనూ ఒకడుంటాడు అని పెట్టారు.

    విలన్స్ ఒత్తిడి తెస్తారు

    విలన్స్ ఒత్తిడి తెస్తారు

    ఓ సారి సత్యరాజ్ వద్దకు విధి నిర్వహణలో భాగంగా ఓ ఫైల్ వస్తుంది. ఐదు వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్టుకు సంభందించింది. ఈ ప్రపోజల్ కు సైన్ చేస్తే మినిస్టర్ (రావు రమేష్ ) చాలా లాభం. అందుకు సత్యరాజ్ ని సైన్ చేయమని ఒత్తిడి తెస్తారు. కానీ ఆయన నిజాయితి గల వ్యక్తి కావటంతో రిజెక్టు చేస్తాడు.

    విలన్ అంటే అంతే మరి

    విలన్ అంటే అంతే మరి

    సత్యరాజ్ నిజాయితీగా ఫైల్ పై సంతకం చేయను అంటే విలన్ రావు రమేష్ ఊరుకుంటాడా. ఆయన బెదిరిస్తాడు. సామదాన దండోపాయాలు ప్రయోగిస్తాడు. కాని సత్యరాజ్ లొంగడు. అప్పుడు విలన్ కు ఇంకా కాలుతుంది. ఆయన చెయ్యవల్సింది చేసేస్తాడు. సత్యరాజ్ ఇబ్బంది పడతాడు.

    మా నాన్ననే ఇబ్బంది పెడతావా

    మా నాన్ననే ఇబ్బంది పెడతావా

    మరి తన తండ్రి పడుతున్న ఇబ్బందిని చూస్తూ హైపర్ కొడుకు రామ్ ఊరుకుంటాడా. వెంటనే సీన్ లోకి దూకుతాడు. సినిమా అంతా లంచగొండి అయిన ఆ మినిస్టర్ ని ఎలా మన హీరో దెబ్బ కొట్టాడు అన్న యాంగిల్ లో నడుస్తుంది. రావు రమేష్ కు రామ్ కు మధ్య జరిగే వార్ అన్న మాట. ఛీఫ్ మినిస్టర్ గా కె విశ్వనాద్, మరో మనిస్టర్ గా జయప్రకాష్ రెడ్డి కనపడతారు.

    పోసాని పాత్ర రేసుగుర్రం లోదే

    పోసాని పాత్ర రేసుగుర్రం లోదే

    ఇక ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి...హీరోయిన్ రాశి ఖన్నాకు తండ్రిగా కనపిస్తాడు. ఆయన పాత్ర రేసుగుర్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర గుర్తుంది కదా అలా ఉంటుందిట. ఆయన పాత్ర పూర్తి నవ్వులతో సాగుతుందిట. పోసానికి మరోసారి బ్రేక్ వస్తుందంటున్నారు మరి.

    సెకండాఫ్ లో రెచ్చి పోయాడట

    సెకండాఫ్ లో రెచ్చి పోయాడట

    అందుతున్న టాక్ ప్రకారం ..ఈ సినమా ఫస్టాఫ్ ఓకే అన్నట్లు గా సాగుతుందిట. కానీ సెకండాఫ్ మాత్రం అదిరిపోతుందిని చెప్తున్నారు. రావు రమేష్ ని రామ్ దెబ్బ తీసే సీన్లు నవ్వులు పండిస్తాయని చెప్తున్నారు. మంచిఎంటర్టైనర్ అని అంటున్నారు.

    ఈ సినిమాక్లాస్ ని దాటి

    ఈ సినిమాక్లాస్ ని దాటి

    నేనుశైలజ చిత్రంతో క్లాస్ ప్రేక్షకులకు దగ్గరైన రామ్ ..మళ్లీ తన పాత రూట్ లోకి వచ్చి చేసిన చిత్రం హైపర్ అని చెప్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని, వాటితో భాక్సాపీస్ ని తేలిగ్గా గెలుస్తాడని చెప్తున్నారు. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్..కందీరీగను దాటి నవ్వించాడని అంటున్నారు.

    రచ్చ రచ్చ చేస్తుందంటున్నారు

    రచ్చ రచ్చ చేస్తుందంటున్నారు

    ఎ, మల్టిఫ్లెక్స్ లు ప్రక్కన పెడితే, ఈ సినిమా బి,సి సెంటర్లలో రామ్ ఇమేజ్ ని రెట్టింపు చేస్తుందని చెప్తున్నారు. హై ఓల్టేజి యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్ సినిమాకు బాగా ప్లస్ అవుతాయని చెప్తున్నారు. పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో రామ్ ఇష్టపడి చేసిన ఈ చిత్రం అతనిలోని ఎనర్జీని పూర్తిగా పట్టుకుందని అంటున్నారు.

    అంత బిజినెస్ జరిగిందా

    అంత బిజినెస్ జరిగిందా

    కమర్షియల్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద ఆసక్తి బాగానే ఉండటంతో బిజినెస్ కూడా బాగానే జరిగిందని తెలుస్తోంది. బయ్యర్లు కూడా ఈ సినిమాపై బాగానే ఆసక్తి చూపించారు. ‘హైపర్'కు రూ.15 కోట్లకు పైనే బిజినెస్ కూడా జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

    ఈ రేటు వింటే షాకే

    ఈ రేటు వింటే షాకే

    ‘హైపర్' శాటిలైట్ హక్కుల్ని జీ తెలుగు ఛానెల్ రూ.6.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రెగ్యులర్ రామ్ సినిమాల రేంజికి ఇది చాలా పెద్ద మొత్తమే. సాధారణంగా స్టార్ హీరోలకు మాత్రమే ఈ రేటు పలుకుతుంది. ‘హైపర్' మీద ఉన్న పాజిటివ్ టాక్ చూసి.. జీ తెలుగు వాళ్లు ధైర్యం చేసారని చెప్తున్నారు.

    మణిశర్మ సీన్ లోకి వచ్చాడు

    మణిశర్మ సీన్ లోకి వచ్చాడు

    ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గిబ్రాన్ ఇచ్చిన పాటలు ఎక్కడ చూసినా వినపడుతున్నాయి. ఇప్పుడీ హైపర్ కు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను.. మెలోడీ బ్రహ్మగా పేరు గడించిన మణిశర్మ అందించాడంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు రామ్.

    సత్యరాజ్ పాత్ర సైతం..

    సత్యరాజ్ పాత్ర సైతం..

    తండ్రి సత్య రాజ్ ను విపరీతంగా.. అమ్మకంటే ఎక్కువగా ప్రేమించేసే కొడుకుగా రామ్ నటించాడు. మా నాన్న అంటే నాకు పిచ్చి అని చెప్పేసే కేరక్టర్ హీరోది. తనపై ప్రేమను కొంచెమైనా వేరే వాళ్లకు షిఫ్ట్ చేయమనే కోరుకునే తండ్రిగా సత్యరాజ్ ఆకట్టుకుంటాడు

    ఈ సినిమాలో అలా కాదు

    ఈ సినిమాలో అలా కాదు

    ప్రతి సినిమాలోనూ అమ్మాయి కోసం, అమ్మ కోరిక కోసం... ఫైట్ చేస్తూ కనిపిస్తాను. అయితే ఈ సినిమాలో మాత్రం అలా కాదు. నేను శైలజ తరువాత ఇంకేదైనా కొత్తగా చెప్పాలని ఆలోచిస్తున్న సమయంలో సంతోష్ శ్రీనివాస్ హైపర్ కథ చెప్పాడు. ఇలాంటి మెసేజ్‌ని నేను మాత్రమే చెబితే సరిపోదని తండ్రి పాత్ర కోసం సత్యరాజ్ వంటి సీనియర్ నటుడిని తీసుకున్నాం. వాణిజ్య అంశాల్ని మిళితంచేసి అంతర్లీనంగా షుగర్ కోటెడ్‌గా మేము చెప్పాలనుకున్న సందేశాన్ని చెబుతున్నాం అంటున్నారు రామ్.

    చూడాలి మరి ఏం చేస్తాడో

    చూడాలి మరి ఏం చేస్తాడో

    'సంతోష్ శ్రీనివాస్' గతంలో 'రామ్' తో 'కందిరీగ' లాంటి సూపర్ హిట్టు మూవీ తీశాడు. దీంతో 'హైపర్' ఆ సక్సెస్ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని యూనిట్ నమ్మకంగా ఉంది. అయితే ఈ దర్శకుడు యంగ్ టైగర్ 'ఎన్టీఆర్' తో చేసిన 'రభస' డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు 'రామ్' 'రాశిఖన్నా' కాంబినేషన్ లో వచ్చిన 'శివం' డిజాస్టర్ అనిపించుకుంది. మరి 'రామ్ సంతోష్ శ్రీనివాస్' 'కందిరీగ' సక్సెస్ ని రిపీట్ చేస్తారా లేక 'శివం', 'రభస' చిత్రాలను గుర్తుకు తెచ్చారా అనేది కాస్త ఇంట్రెస్టింగ్ ఉంది.

    రామ్ ఏమంటాడంటే..

    రామ్ ఏమంటాడంటే..

    "నేను, సంతోష్ శ్రీనివాస్ చేసిన కందిరీగ పెద్ద హిట్ అయ్యింది. మళ్ళీ మా కాంబినేషన్ లో మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. హైపర్ చిత్రం సెప్టెంబర్ 30న విడుదలవుతుంది. నిర్మాతలు గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంక గారు సినిమాను ఎంతో ప్యాషన్ తో నిర్మించారు. అందరినీ ఎంటర్ టైన్ చేసేలా సినిమా ఉంటుంది" అన్నారు.

    అప్పుడే హైపర్ మొదలైంది

    ఈ సినిమాకు ట్రైలర్ తోనే కిక్ వచ్చేసిందనే చెప్పాలి. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ హైపర్ ..టైటిల్ కు తగ్గట్లే ట్రైలర్ ఉందని మెచ్చేసుకున్నారు. సినిమా కూడా అలాగే ఉండబోతోందని నమ్ముతున్నారు.

    దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ...

    దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ మాట్లాడుతూ...

    " ప్రతి ఒకరికి వారి తండ్రే హీరో. ఈ సినిమాలో హీరోకు కూడా తండ్రే హీరో. తండ్రిని గెలిపించే కథే హైపర్‌. కథ రాసుకోగానే రామ్‌ ఎనర్జీకి పర్‌ఫెక్ట్‌ గా సరిపోయే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. సెప్టెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది" దర్శకుడు సంతోష్ శ్రీన్ వాస్ అన్నారు. అలాగే‘కందిరీగ'లో రామ్ ఒక యువకుడిగా దూకుడుగా ఉంటూ తన ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఇందులో మాత్రం ఒక బాధ్యతగల కొడుకుగా తండ్రి కోసం కష్టపడతాడు. అప్పటికీ ఇప్పటికీ ఆయన నటనలో చాలా మెచ్యూరిటీ వచ్చింది. ఆ మార్పు చూసి నాకే చాలా ఆశ్చర్యం వేసింది.

    ఖచ్చితంగా హిట్ కొడతాం

    ఖచ్చితంగా హిట్ కొడతాం

    " రామ్, సంతోష్ శ్రీన్ వాస్ ల హైపర్ పాటలకు, రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్సందన వచ్చింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని `యు/ఎ` సర్టిఫికేట్ ను పొందింది. సినిమాను వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 30న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం" నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర మాట్లాడుతూ...అన్నారు.

    ఎవరెవరు ఈ సినిమాకి

    ఎవరెవరు ఈ సినిమాకి

    ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, రావు రమేష్‌, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్‌, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటింగ్‌: గౌతంరాజు, మాటలు: అబ్బూరి రవి, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంతోష్‌ శ్రీన్‌వాస్‌.

    English summary
    Energetic Hero Ram who started off the New Year scoring a sensational hit romancing cute Keerthy Suresh in romantic entertainer Nenu Sailaja is now getting ready to entertain movie lovers with his upcoming entertainer Hyper. world. Ram is romancing hot and ravishing Rashi Khanna in the film. In the meantime FilmNagar is abuzz with the inside talk of the film Hyper.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X