Tamannaah Bhatia: కొత్త బిజినెస్‌లోకి తమన్నా? బ్రేకప్‌తో రూట్ మార్చిన మిల్కిబ్యూటీ

హీరోలతో పోలిస్తే హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువ. బాగా హిట్స్ ఇస్తే ఐదేళ్లు లేదంటే దానికి మరో రెండేళ్లు పొడిగింపు. ఇంత తక్కువ గ్యాప్‌లోనే జీవితం మొత్తానికి సరిపడా సంపాదించాలని ముద్దుగుమ్మలు తెగ కష్టపడుతున్నారు. ఒక్క సినిమా విజయానికే రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేస్తున్నారు. అలాగే తమ సంపాదను రియల్ ఎస్టేట్, షేర్ల వైపు మళ్లిస్తున్నారు. మరికొందరైతే తెలివిగా వ్యాపారాలు ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి వారెందరో. వీరిలో తమన్నా భాటియా కూడా ఒకరు.

20 ఏళ్ల కెరీర్ పూర్తి
ఈ ఏడాదితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి ప్రవేశించి నేటికీ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు తమన్నా. తను నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గగడం లేదు. ఇక ఐటెం సాంగ్స్‌తో తమన్నా భాటియా దుమ్మురేపుతున్నారు. 5 నిమిషాల పాట కోసం కోట్లలో డిమాండ్ చేస్తూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు.

did Tamannaah Bhatia Launch a new business Her Instagram Post goes viral

తమన్నా- విజయ్ బ్రేకప్
అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది తమన్నా భాటియా పెళ్లి పీటలెక్కేవారు. అయితే తన ప్రియుడు విజయ్ వర్మతో విడిపోవడంతో ఆమె అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. మూడేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగారు విజయ్ వర్మ- తమన్నా. తమ బంధాన్ని గుట్టుగా ఉంచకుండా బయటకు చెప్పేశారు. అలాంటిది ఈ జంట విడిపోవడం అభిమానులను, సినీ వర్గాలను షాక్‌కు గురిచేసింది. బ్రేకప్ తర్వాత తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు తమన్నా భాటియా. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

తమన్నాపై ట్రోలింగ్
అయితే తమన్నా కెరీర్‌లో పెద్దగా పుకార్లు ఎదుర్కోలేదు తమన్నా. ఎప్పుడైతే విజయ్ వర్మతో ప్రేమ, బ్రేకప్ జరిగాయో నాటి నుంచి ఈమెపై ట్రోలింగ్ పెరిగింది. ఈ ప్రభావం తమన్నా అవకాశాలను దెబ్బ తీసిందనే వాదనలు కూడా ఉన్నాయి. రాబోయే కాలంలో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదంతా తమన్నా స్వయం కృతాపరాధమే అనే వారు కూడా ఉన్నారు.

జ్యూవెలరీ బిజినెస్‌లో తమన్నా
బిజినెస్ ఫ్యామిలీ నుంచి రావడంతో తమన్నా భాటియా కూడా వ్యాపారంలోకి దిగారు. వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యూవెలరీ బ్రాండ్‌ను ప్రారంభించిన తమన్నా దానిని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతున్నారు. మహిళలకు నచ్చే విధంగా సరికొత్త డిజైన్లలో డైమండ్ జ్యూయెలరీని ప్రవేశపెడుతన్నారు తమన్నా. దీనితో పాటు షుగర్ కాస్మోటిక్స్ అనే సంస్థలో తమన్నా పెట్టుబడులు పెట్టారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తమన్నా భాటియా ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

తమన్నా కొత్త వ్యాపారం
తాజాగా మిల్కీబ్యూటీ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కార్పోరేట్లు ధరించే సూట్‌లో ఎవరితోనో మాట్లాడుతూ తమన్నా కనిపించారు. ఈ పోస్టులో మై ఫౌండర్ ఫేస్ అని రాసుకొచ్చారు. చూస్తుంటే ఆమె కొత్తగా ఏదో వ్యాపారం ప్రారంభించినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తమన్నా నిజంగానే కొత్త బిజినెస్ స్టార్ట్ చేశారా? లేదా? ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X