»   » అభిషేక్, ఐశ్వర్య విభేదాలు తీవ్రస్థాయికి.. ఆరాధ్యపై జోరుగా వాగ్వాదం..

అభిషేక్, ఐశ్వర్య విభేదాలు తీవ్రస్థాయికి.. ఆరాధ్యపై జోరుగా వాగ్వాదం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయట. యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో రణబీర్ కపూర్‌తో మితిమీరిన శృంగార సన్నివేశాల నేపథ్యంలో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్టు మీడియా కోడైకూసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వారిద్దరి మధ్య తగువులాట భారీగానే ఉంటుందట.

ఆరాధ్య విషయంపై అభిషేక్, ఐశ్వర్య..

ఆరాధ్య విషయంపై అభిషేక్, ఐశ్వర్య..

ఆ విషయం పక్కన పెడితే కూతురు ఆరాధ్య బచన్ అంశం అభిషేక్, ఐశ్వర్య మధ్య మరో వివాదంగా మారిందట. బాలీవుడ్‌లో బాలతారగా ఆరాధ్య నటింపజేయాలని అభిషేక్ వాదన. ఇప్పటి నుంచే ఆరాధ్య షూటింగ్ అలవాటు పడితే పెద్ద యుక్త వయస్సుకు వచ్చే టప్పటికి నటనలో రాటుదేలుతుందనేది జూనియర్ బచ్చన్ అభిప్రాయం.

అభిషేక్‌బచ్చన్‌పై ఐశ్వర్య గుర్రుగా

అభిషేక్‌బచ్చన్‌పై ఐశ్వర్య గుర్రుగా

అయితే అభిషేక్ నిర్ణయంపై ఐశ్వర్య అసంతృప్తిగా ఉందట. మీడియా ప్రచారానికి దూరంగా ఆరాధ్యను ఉంచాలనేది ఐశ్వర్య భావన. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకొన్నాయట.

యే దిల్ హై ముష్కిల్‌లో హాట్ హాట్‌గా

యే దిల్ హై ముష్కిల్‌లో హాట్ హాట్‌గా

గతంలో యే దిల్ హై ముష్కిల్‌లో ఐశ్వర్య హాట్ హాట్‌గా నటించడంపై ఐశ్వర్యను అత్త జయబచ్చన్ మందలించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయమే కాకుండా ఐశ్వర్య బిహేవియర్‌పై జయబచ్చన్ అసంతృప్తిగా ఉందనే రూమర్ కూడా సోషల్ మీడియాలో ప్రచారమైంది.

వివాదాస్పదంగా మారిన ఐశ్వర్య నటన

వివాదాస్పదంగా మారిన ఐశ్వర్య నటన

ఇటీవల విడుదలైన యే దిల్ హై ముష్కిల్ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో ఐశ్వర్య బచ్చన్ హాట్ హాట్‌గా నటించడం వివాదాస్పదమైంది. బచ్చన్ ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా శృంగార సన్నివేశాల్లో ఐశ్వర్య నటించడంపై బాలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

English summary
Abhishek Bachchan and Aishwarya Rai Bachchan are fighting over their daughter Aaradhya Bachchan. Abhishek wants Aaradhya to start working in Bollywood as a child artist. While Aishwarya is unhappy with his decision.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu