అల్లు అర్జున్- త్రివిక్రమ్ మధ్య విభేదాలు.. బన్నీ వద్దన్నా మాటల మాంత్రికుడు వినడం లేదా?
'నా పేరు సూర్య' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు. ఇందులో భాగంగా అల్లు అర్జున్ కెరీర్‌లో 19 వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి వస్తున్న ఆసక్తికర అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ నింపుతుండగా, తాజాగా బయటకొచ్చిన ఓ న్యూస్ మాత్రం షాకిస్తోంది. ఓ విషయమై అల్లు అర్జున్- త్రివిక్రమ్ మధ్య విభేదాలు తలెత్తాయనేది ఆ వార్తల సారాంశం. ఇంతకీ మాటల మాంత్రికుడు, బన్నీ మధ్య ఎక్కడ చెడింది? వివరాలు చూస్తే..

శరవేగంగా AA19 షూటింగ్
అల్లు అర్జున్- త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విలక్షణ కథాంశంతో రూపొందించబడుతున్న ఈ సినిమా ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే చిత్రంలో ఐటెం సాంగ్ ఉండాలని అనుకుంటున్న త్రివిక్రమ్‌కి బన్నీ అడ్డు చెబుతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

గత సినిమాల్లో లేదు.. కనీసం ఇప్పుడైనా
గతంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి సినిమాల్లో ఐటెం సాంగ్స్ లేవు. కాబట్టి ఈ సినిమాలో అయినా ఆడియన్స్‌ని ఉర్రూతలూగించేలా ఓ ఐటెం సాంగ్ పెట్టాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. కానీ అందుకు అల్లు అర్జున్ ససేమిరా కుదరదని అంటున్నాడట. అయితే తండ్రీకొడుకుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ కథకు ఐటెం సాంగ్ సూట్ కాదనేది బన్నీ వాదన. దీంతో ఈ విషయం లోనే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని తెలుస్తోంది.

నాన్న నేను..
హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు 'నాన్న నేను' అనే టైటిల్ పరిశీలనలో పెట్టారని సమాచారం. తండ్రి సెంటిమెంట్ తో కూడిన స్క్రిప్ట్‌పై త్రివిక్రమ్ సర్వహంగులు జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

భారీ అంచనాల నడుమ AA19
గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేస్తోంది. సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో యంగ్ హీరో సుశాంత్, మరో హీరోయిన్ నివేద పేతురేజ్ కూడా భాగమవుతున్నారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబోలో హాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











