వెంకీ-పవన్ మధ్య విబేధాలు అందుకేనా?
విక్టరీ వెంకటేష్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య విబేధాలు ఉన్నాయని, అందుకే వారు ఈ మధ్య ఎడమొహం, పెడమొహంగా కనిపిస్తున్నారని ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వినడానికి నమ్మశక్యంగా లేక పోయినా ఇది నిజం అంటున్నారు చాలా మంది. మరి ఎందుకు ఇద్దరి మధ్య ఇలాంటి పరిస్థితి నెలకొంది అని కొందరు ప్రయత్నించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయట.
ప్రస్తుతం వెంకటేష్ మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీ స్టారర్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పిన తర్వాత మరో హీరోగా పవన్ కళ్యాణ్ అయితే బాగుండని భావించాడట వెంకీ. ఈ మేరకు దర్శకుడి ద్వారా అతనితో సంప్రదింపులు జరుపగా నాకు ఫ్యామిలీ సబ్జెక్టులు సరిపడవు అంటూ పవన్ తిస్కరించాడని అంటున్నారు. అందుకే వెంకటేష్ పవన్ కళ్యాణ్ అంటే ఎడమొహంగా ఉంటున్నారని అంటున్నారు.
ఇటీవల జరిగిన రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ వేడుకలో కూడా వీరిద్దరి మధ్య విబేధాలు బయట పడ్డాయి. జూ ఎన్టీఆర్ ఈ వేడుకలో పవన్‌తో మాట్లాడుతుండగా వచ్చిన వెంకటేష్ జూనియర్ ఎన్టీఆర్ ను పలకరించాడే తప్ప పవన్‌తో అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. మరి ఈ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరేది ఎప్పుడో? అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
వెంకీ-మహేష్ సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ చిత్రం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











