హీరో రవితేజ మేనేజర్ రాజా రవీంద్రతో పొరపొచ్చాలా?
రవితేజ పర్శనల్ మేనేజర్ (కాల్ షీట్స్, డేట్స్ చూడటం) రాజా రవీంద్రతో గత కొద్ది రోజులుగా పొసగటం లేదని వినికిడి. తాజాగా రాజా రవీంద్రకు రవితేజ స్వస్తి చెప్పటానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. ఇక రవితేజ మార్కెట్ రేటుని స్ట్రాటజీగా పెంచటంతో రాజా రవీంద్ర పాత్ర ఎక్కువ ఉందని ఇండస్ట్రీ లో చెప్తూంటారు. అయితే రవితేజ హీరో కాకముందు నుంచి వీరి స్నేహం రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలతో దెబ్బ తిందని అదే ప్రొపెషనల్ జీవితంలోని తగువులకు కారణమైందని చెప్తున్నారు. ఇక రాజా రవీంద్ర తాజాగా కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు చిత్రంలో నో బ్రెయిన్ డాట్ కాం ఓనర్ ఈవీగా నటిస్తున్నారు. రేటు చెప్పు..రేటింగ్ ఇస్తా అనే ఊతపదంగా ఈ క్యారెక్టర్ ని వర్మ క్రియోట్ చేసినట్లు సమాచారం. అలాగే రవితేజ ప్రస్తుతం మిరపకాయ చిత్రంలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











