చివరకు దిల్ రాజు కన్ను అతడిపై పడిందా? ప్రయత్నం ఫలించేనా?

2017తో పోలిస్తే 2018లో దిల్ రాజు పేరు అంతగా మారుమ్రోగలేదనే చెప్పాలి. ఈ ఏడాది ఆయన లవర్, శ్రీనివాస కళ్యాణం, హలో గురు ప్రేమకోసమే లాంటి చిత్రాలు రూపొందించారు. అయితే అవి ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ ఫలితాలు ఇవ్వలేదు. దీంతో దిల్ రాజు కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అవసరం అయితే పక్క ఇండస్ట్రీలో హిట్టైన సినిమాలను సైతం రిమేక్ చేసేందుకు వెనకాడటం లేదు. తమిళంలో విజయం సాధించి '96' మూవీ రీమేక్ హక్కులు పొందిన ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 తమిళంలో సూపర్ డూపర్ హిట్

తమిళంలో సూపర్ డూపర్ హిట్


విజయ్ సేతుపతి, త్రిష జంటగా రూపొందిన ‘96' చిత్రం అక్కడ సంచలన విజయం సాధించింది. సినిమా విడుదలైన 5వ వారమే ఈ చిత్రం టీవీల్లో వేసినా... థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా యువతకు ఈ మూవీ బాగా నచ్చింది.

తెలుగు రీమేక్‌లో ఆ హీరోల పేర్లు

తెలుగు రీమేక్‌లో ఆ హీరోల పేర్లు

96 తెలుగులో రీమేక్ అవుతుందనే విషయం బయటకు రాగానే రానా, శర్వానంద్, నాని తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఆ మధ్య రానా, త్రిష జంటగా ఈ మూవీ తెలుగులో తెరకెక్కబోతోందనే వార్తలు సైతం వినిపించాయి.

 దిల్ రాజు కన్ను ఆ హీరో మీదనే

దిల్ రాజు కన్ను ఆ హీరో మీదనే

బయట చాలా పేర్లు వినిపిస్తున్నా... దిల్ రాజు మనసు మాత్రం మరో హీరో మీద ఉందట. అతడు ఎవరో కాదు హీరో గోపీచంద్. సినిమా కథ అతడికి అయితేనే బాగా సూటవుతుందని దిల్ రాజు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గోపీచంద్‌కు మంచి ఛాన్స్ అంటున్న విశ్లేషకులు

గోపీచంద్‌కు మంచి ఛాన్స్ అంటున్న విశ్లేషకులు

గోపీచంద్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు. ఫార్మాట్ మార్చేసి 96 లాంటి కొత్త తరహా చిత్రాలు చేస్తే అతడి ఇమేజ్ చేంజ్ అవ్వడంతో పాటు మంచి ఫలితం అందుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగులో దర్శకత్వం వహించేది ఎవరు?

తెలుగులో దర్శకత్వం వహించేది ఎవరు?

తమిళంలో 96 చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ తెలుగులోనూ డైరెక్షన్ బాధ్యతలు వహించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు నేటివిటీకి తగిన విధంగా స్క్రిప్టును మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X