సిద్దార్ధ గురించి దిల్ రాజు బ్యాడ్ అవుతున్నాడు
సిద్దార్ధ పై ఎలక్ట్రానిక్ మీడియా బ్యాన్ పెట్టి, మా కి కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సిద్దార్ధకు మా అశోశియేషన్ వాళ్ళు నోటీసులు కూడ జారీ చేసారు. అయితే సిద్దార్ద చాలా కూల్ గా ఉన్నాడు.దానికి కారణం దిల్ రాజు. దిల్ రాజు ఓహ్ ..మై ప్రెడ్ సినిమాలో సిద్దార్ద నటిస్తున్నాడు. సిద్దార్ద పై ఏమన్నా చర్య తీసుకుంటే దిల్ రాజు సినిమా ఆగిపోతుంది. దాంతో దిల్ రాజు దానకి అడ్డుపడుతున్నాడు. మీడియాకు సర్దిచెప్పేందుకు ఆయన ట్రై చేస్తున్నారు.మీడియా వారు మాత్రం సిద్దార్ద ఎట్టి పరిస్దితుల్లోనూ క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుపడుతున్నారు. అయితే సిద్దార్ద మాత్రం దానికి అంగీకరించటం లేదు. దాంతో దిల్ రాజు పై మీడియాలో నెగిటివ్ గా మాట్లాడుకోవటం స్టార్ట్ అయ్యింది. ఆయన పరిస్ధితిని అర్దం చేసుకుని సహకరించకుండా తన లబ్ది కోసం మాట్లాడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తుంది. ఇక సినిమా పూర్తయితే దాని ప్రమోషన్ కి తమ అవసరం వస్తుంది కదా అని మీడియా వారు అంటున్నారు.ఈ నేపధ్యంలో దిల్ రాజు ఎలా ఈ సమస్యను పరిష్కరిస్తాడనేది ఆసక్తికరం.


Click it and Unblock the Notifications











