»   » పవన్ కళ్యాణ్ పై పగ పెట్టుకునే చేస్తున్నాడా?

పవన్ కళ్యాణ్ పై పగ పెట్టుకునే చేస్తున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నిర్మాత పగ తీర్చుకుంటున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో ,వెబ్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఎవరా పెద్ద నిర్మాత...ఆయనికి పవన్ పై పగ తీర్చుకోవాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటూ మాట్లాడుకుంటున్నారు. వారు చెప్పుకునేదాని ప్రకారం ఆ పెద్ద నిర్మాత దిల్ రాజు. ఆయన కావాలనే పవన్ పై పగ తీర్చుకునేందుకే ... ఆయన తాజా చిత్రం 'అత్తారింటికి దారేది' పై జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా' వేస్తున్నాడంటున్నారు. అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు.

ఇంతకీ దిల్ రాజుకి ..పవన్ పై కోపానికి కారణం ఓ రీజన్ చెప్తున్నారు. అదేమిటంటే...ఆయన పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' నైజాం రైట్స్ ని అడిగితే కాదని ..పవన్ కి వీరాభిమాని అయిన నితిన్ కి ఇవ్వటం అంటున్నారు. దాంతో కావాలనే ఇలా చేస్తున్నాడు అంటున్నారు. ఖచ్చితంగా ఎన్టీఆర్ చిత్రం ద్వారా ఎంతో కొంత కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందనే అంటున్నారు. అయితే దిల్ రాజు లాంటి ప్రముఖ వ్యక్తి, రేపో మాపో పవన్ తో సినిమా చేస్తానంటున్న వ్యక్తి ఇలాంటివి మనస్సులో పెట్టుకుంటాడా అనేదే నమ్మలేని ప్రశ్న. ఇవన్నీ అర్దం లేని రూమర్స్ అని దిల్ రాజు క్యాంప్ వారు కొట్టిపారేస్తున్నారు.

ఇక పలుమార్లు చిత్ర విడుదల తేదిన ప్రకటించి.. వాయిదా పరిస్థితి తెలెత్తింది. విడుదల తేదిని ప్రకటించిన వాయిదా వేసిన వాటిలో ఎవడు, అత్తారింటికి దారేది? రామయ్యా వస్తావయ్యా లాంటి భారీ చిత్రాలున్నాయి. ఓ దశలో ఓ చిత్ర నిర్మాతకు పెద్ద మొత్తంలో టేబుల్ ప్రాఫిట్ వచ్చిందని అనధికారికంగా వార్తలు వెలువడ్డాయి. అయితే విడుదల వాయిదా పడి.. నెలకు పైగా వేచి ఉండాల్సి పరిస్థితి తెలెత్తడంతో ఆర్ధిక సమస్యలు ప్రారంభమైనట్టు తెలిసింది.

పరిస్థితులు ఇలాగే కొనసాగితే చిత్ర నిర్మాణం నుంచి తప్పుకునేందుకైనా సిద్ధం అన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే ఆరంభంలో ఉన్న పరిస్థితి కొంత సద్దుమణిగినట్టు కనిపించగానే చిన్న చిత్రాలు విడుదల జోరందుకుంది. అంతకుముందు..ఆ తర్వాత, పోటుగాడు, కమీనా, కిస్ లాంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చిన్న చిత్రాలకు సమైక్య ఉద్యమకారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకపోవడం గమనించిన చిత్ర పరిశ్రమ ప్రముఖులు భారీ చిత్రాల విడుదల తేదిలను ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా', రామ్ చరణ్ 'ఎవడు' సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో విడుదలకు నోచుకోలేకపోయాయి. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేశారు. సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల అంటేనే టాలీవుడ్ లో భారీ చిత్రాలతో నిజమైన పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుత పరిస్థితులను బేరిజు వేసుకుని నిర్మాతలు కొంత ధైర్యాన్ని కూడగట్టుకుని విడుదల తేదిని ప్రకటించినట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 9 తేదిన అత్తారింటికి దారేది?, 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రాల విడుదలకు సన్నద్దం చేస్తున్నారు.

రెండు భారీ సినిమాలే కావడం, రెండు భారీ తారాగణం తో కూడిన సినమాలే కావడంతో....రెండింటిపైనా అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు భారీ అభిమాన గణం ఉన్న వారు కావడంతో విడుదల సమయానికి పోటీ ఆసక్తికరంగా మారనుంది. మరి ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తోరో చూడాలి.

English summary
The much awaited Pawan Kalyan and Trivikram's yet-to-be-titled film's release date is set to be August 7th. And, NTR and Harish Shankar's Ramayya Vastavayya's release date is set to be August 9th.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu