రేంజ్ దాటుతోందని దర్శకుని చేతిలో చీవాట్లు తిన్న హీరోయిన్...
తన సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం అస్సలు ఇష్టపడని దిల్ రాజు ఎలాంటి సమస్య వచ్చినా తెరవెనుకే పరిష్కరించుకోడానికి ఇష్టపడతాడు. తెలుగు సినీ పిరిశ్రమలో ఇటీవలి కాలంో ఎక్కువైపోయిన టైటిల్ వివాదాల్లో తన సినిమా ఏదీ చిక్కుకోరాదని దిల్ రాజు జాగ్రత్త పడుతుంటాడు. ప్రస్తుతం ప్రభాస్ తో నిర్మిస్తున్న చిత్రం టైటిల్ 'మిస్టర్ పర్ ఫెక్ట్" అని అతనింకా ఎక్కడా ప్రకటించకపోవడానికి కారణం కూడా అదే. ఈ టైటిల్ వేరే వారి పేరు మీద రిజిష్టర్ అయి ఉండడంతో టైటిల్ కోసం దిల్ రాజు తెరవెనుక రాయబారాలు సాగిస్తున్నాడు. ముందు జాగ్రత్తగా టైటిల్ ఇదే అంటూ ఎక్కడా ప్రకటించడం లేదు.
ఒకవేళ బేరం కుదరకపోతే వేరే టైటిల్ కుదరకపోతే వేరే టైటిల్ పెట్టుకుందామని, మిస్టర్ ఫర్ ఫెక్ట్ అని టైటిల్ ప్రకటించి ఇరుకున పడిపోరాదని దిల్ రాజు కేర్ తీసుకున్నాడు. అయితే ఈ చిత్ర కథానాయికల్లో ఒకరైన తాప్సీ దీని టైటిల్ మిస్టర్ పర్ ఫెక్ట్ అని ప్రకటించేసింది చాలా క్యాజువల్ గా నోరు జారిన తాప్సీ కారణంగా మిస్టర్ పర్ ఫెక్ట్ టైటిల్ ని మీడియా అఫిషియల్ గా కన్ ఫర్మ్ చేసేస్తోంది. దీంతో ఒళ్లు మండిన దిల్ రాజు తాప్సీకి ఫుల్ గా క్లాస్ పీకాడని తెలుస్తోంది. తన సినిమా గురించి బయట ఎక్కడైనా మాట్లాడితే సహించేది లేదని లెప్ట్ అండ్ రైట్ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











