బొమ్మరిల్లు కాంబో సెట్టయ్యింది.. వచ్చే ఏడాది సెట్స్ పైకి
దిల్ రాజు నిర్మాతగా అత్యధిక ప్రాఫిట్స్ అందుకున్న సినిమాల్లో బొమ్మరిల్లు ఒకటి. ఆ సినిమా పెట్టిన పెట్టుబడికి మూడింతల లాభాలని అందించింది. ఒక ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా ద్వారా అందులో నటీనటులకు అలాగే టెక్నీషియన్స్ కు చాలా వరకు జీవితానికి సరిపడా గుర్తింపు దక్కింది. ఇక ఆ తరువాత హీరో సిద్దార్థ్ రేంజ్ కూడా చాలానే పెరిగింది. కానీ మళ్ళీ బొమ్మరిల్లు లాంటి హిట్టయితే అందుకోలేదు.
అసలు మ్యాటర్ లోకి వస్తే చాలా కాలం తరువాత మళ్ళీ దిల్ రాజు, సిద్దార్థ్ కలవబోతున్నట్లు తెలుస్తోంది. చివరగా వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఓ మై ఫ్రెండ్. అయితే ఆ సినిమా అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇక మళ్ళీ పదేళ్ల అనంతరం దిల్ రాజు నుంచి సిద్దార్థ్ కు ఫోన్ కాల్ వెళ్లినట్లు టాక్ వస్తోంది. స్టోరీ కూడా సెట్టయినట్లు తెలుస్తోంది.

ఇక దర్శకుడు మరెవరో కాదు, ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలతో తనకంటూ ఒక ప్రతేకమైన గుర్తింపును అందుకున్న విరించి వర్మ అని తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం సిద్దార్థ్ మహాసముద్రం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా మరో హీరో శర్వానంద్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











