Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నందమూరి సింహంతో దిల్ రాజు బిగ్ బడ్జెట్ మూవీ.. దర్శకుడు ఎవరంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంబినేషన్స్ పై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. ఇక దిల్ రాజు లాంటి నిర్మాత స్టార్ హీరోలతో కలిస్తే ఆ సినిమాల మార్కెట్ అమాంతంగా పెరిగిపోతుంది. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో భారీ స్థాయిలో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్న దిల్ రాజు రానున్న రోజుల్లో మరికొంతమంది అగ్ర హీరోలతో కూడా సినిమాలను చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఎన్నోసార్లు సినిమా చేయాలని..
దిల్ రాజు దాదాపు తెలుగు ఇండస్ట్రీలో అందరి హీరోలతో వర్క్ చేశారు. చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అందరిని కవర్ చేసుకుంటూ వస్తున్న రాజుగారు గతంలోనే పవన్ కళ్యాణ్ తో ఎన్నోసార్లు సినిమా చేయాలని అనుకున్నారు. కానీ ఇన్నాళ్లకు పింక్ రీమేక్ ద్వారా పవన్ సినిమాను నిర్మించే అవకాశం వచ్చింది.
బాలయ్యతో మొదటిసారి
అలాగే నందమూరి ఫ్యామిలిలో జూనియర్ ఎన్టీఆర్ తో పలు సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఇప్పుడు. మొదటిసారి నందమూరి నటసింహం బాలకృష్ణపై కూడా ఒక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. 20 ఏళ్ల సినిమా కెరీర్ లో దిల్ రాజు బాలయ్యతో సినిమా చేస్తున్నట్లు టాక్ కూడా రాలేదు. ఇక మొత్తానికి నెక్స్ట్ ఇయర్ అది నిజం కావచ్చని సమాచారం.
నటవిశ్వరూపం
ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా సమ్మర్ కానుకగా మే 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైమ గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలకృష్ణ నటవిశ్వరూపం చూపించనున్నట్లు సమాచారం.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో..
ఇక దిల్ రాజుతో చేయబోయే సినిమాకు దర్శకుడు ఎవరంటే.. అనిల్ రావిపూడి అని తెలుస్తోంది. గతంలో బాలకృష్ణకు అనిల్ ఒక సినిమా కథ చెప్పాడు. రామారావు అనే టైటిల్ కూడా అనుకున్నట్లు టాక్ వచ్చింది. ఇక దిల్ రాజు ఇప్పుడు ఈ కాంబినేషన్ ను కలిపి బిగ్ బడ్జెట్ తో సినిమాని నిర్మించడానికి రెడీ అయినట్లు సమాచారం.