పవన్-త్రివిక్రమ్ క్రేజ్... కోట్లు కుమ్మరించిన దిల్ రాజు?
పవన్25 మూవీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. తాజాగా నైజాం రైట్స్ రికార్డు స్థాయి రేటుకు అమ్ముడైనట్లు సమాచారం.
Recommended Video

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. అందులో జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ దర్శకత్వం అంటే బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవన్ క ళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రైట్స్ దక్కించుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతున్నారు. తెలుగు సినిమా రంగంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్ అగ్రస్థానంలో కొనసాగుతున్న దిల్ రాజు.... ఈ చిత్రం నైజాం రైట్స్ దక్కించుకోవడానికి కోట్లు కుమ్మరించినట్లు ప్రచారం జరుగుతోంది.

భారీగా బిజినెస్
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. సెట్స్ పై ఉండగానే ఈ సినిమాకు భారీగా బిజినెస్ జరుగుతోంది.

రూ. 29 కోట్లు పెట్టిన దిల్ రాజు?
ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం రూ. 29 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

బాహుబలి తర్వాత ఇదే
నైజాం ఏరియాలో 'బాహుబలి' తరువాత ఈ స్థాయి రేటు పలికి సినిమా ఇదేనని, పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కాబట్టి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తప్పకుండా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయిని ట్రేడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

శాలిలైట్ రైట్స్
జెమినీ టీవీ వారు ఈ చిత్రం శాటిలైట్ రూ. 19.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం శాటిలైట్ రూపంలోనే ఈచిత్రానికి ఇంత భారీ రేటు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ డబ్బుతో ఓ మీడియం రేంజి తెలుగు సినిమా తీయొచ్చని చర్చించుకుంటున్నారు.

ప్రీ రిలీజ్ బిజినెస్
మరో వైపు ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగబోతోంది. ఇప్పటికే అన్ని ఏరియాలకు ముందస్తుగానే భారీగా థియేట్రికల్ రైట్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రూ. 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంచనా.

పవన్ కళ్యాణ్
ఈ చిత్రంలో పవర్ స్టార్ సరసన కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

అంచనాలు భారీగానే
గతంలో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా, అత్తారంటికి దారేది లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద మరిన్ని సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.


Click it and Unblock the Notifications











