గేమ్ ఛేంజర్ మూవీకి రాంచరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదా? ఆ స్టార్ హీరోను దిల్ రాజు ఎందుకు వదులుకొన్నాడంటే?

తెలుగు సినిమా దగ్గర చాలా మంది అగ్ర తారలు ఉన్నారు కానీ చాలా ఏళ్ళు సరైన హిట్ లేకపోయినప్పటికీ తన ఫాలోయింగ్ తో రికార్డు ఓపెనింగ్స్ కొట్టగలిగే ఏకైక హీరో మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. కాగా ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా హీరోస్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మార్కెట్ ని క్రేజ్ ని పవన్ సహా మహేష్ బాబు లాంటి స్టార్స్ చూసేసారు.

కానీ వీరు చేసిన మిస్టేక్ ఏంటి అంటే పాన్ ఇండియా మార్కెట్ లోకి అంత త్వరగా వెళ్లకపోవడమే అని చెప్పాలి. దీనితో ఇతర హీరోలు ముందుకెళ్ళిపోయారు వీరు తెలుగు రాష్ట్రాల వరకే వారి మార్కెట్ ని పరిమితం చేసుకున్నారు. కాగా పాన్ ఇండియా సినిమాలు ఊపందుకున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ రెండు స్ట్రైట్ సినిమాలు అది కూడా పాన్ ఇండియా సినిమాలు అనౌన్స్ చేసి సిద్ధం చేస్తుండడం కేజ్రీగా మారింది.

dil raju changed pawan name for game changer with trust issues

కాగా ఆ సినిమాలే "హరిహర వీరమల్లు", "ఓజి" లు కాగా ఈ సినిమాలు కాకుండా పవర్ స్టార్ ఓ సెన్సేషనల్ పాన్ ఇండియా సినిమా చేయాల్సింది కానీ అది మిస్ అయ్యింది. ఆ సినిమా ఏదో కూడా ఇప్పుడు అబ్బాయి రామ్ చరణ్ చేసిన "గేమ్ ఛేంజర్" సినిమానే.. కాగా ఈ సినిమాని సంచలన దర్శకుడు శంకర్ మొదటగా పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది అని చెప్పారని నిర్మాత దిల్ రాజు చెప్పారు.

అయితే ఇది పాత స్టేట్మెంట్ కూడా అయినప్పటికీ మళ్ళీ దిల్ రాజు దీనిని చెప్పడం వైరల్ గా మారింది. శంకర్ గారు పవన్ లాంటి హీరో ఈ సినిమాకి పర్ఫెక్ట్ అని చెబితే తానే రామ్ చరణ్ తో చేస్తే బాగుంటుంది అని చెప్పానని అసలు విషయం రివీల్ చేశారు. అయితే ఇది కొంతమందికి ట్రిగ్గర్ అయ్యింది.

dil raju changed pawan name for game changer with trust issues

ప్రెజెంట్ పాన్ ఇండియా మార్కెట్ లో రామ్ చరణ్ కి మంచి క్రేజ్ ఉంది కానీ పవన్ కి ఆ సినిమా స్టార్ట్ చేసేనాటికి లేదు. పైగా గేమ్ ఛేంజర్ కి ముందే రాజమౌళి లాంటి దర్శకుడితో చరణ్ RRR చేస్తుండడంతో అప్పటికే పాన్ ఇండియా లెవెల్లో చరణ్ స్టాంప్ పడింది. సో ఇలా మార్కెట్ పరంగా చూసి దిల్ రాజు పవన్ తో వద్దకునుకొని చరణ్ తో చేసుండాలి.

లేకపోతే తెలుగు స్టేట్స్ లో పవన్ లాంటి స్టార్ ని పక్కన పెట్టి మరో హీరోకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరగని పని. సో దిల్ రాజు ఇలా పవన్ మార్కెట్ ని చరణ్ మార్కెట్ ని అంచనా వేసుకొని ఓ నిర్మాతగా మంచి స్టెప్ నే తీసుకున్నారని అనుకోవచ్చు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ఈ ఏడాది క్రిస్మస్ లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా సినీ వర్గాలలో టాక్ నడుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X