త్రివిక్రమ్ ని దెబ్బకొట్టే పనిలో దిల్ రాజు
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో త్వరలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ప్రాజెక్టుని ఆపుచేయించి ఆ ప్లేసులో తను వాసు వర్మ దర్సకత్వంలో నిర్మించే చిత్రం చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకుతగినట్లుగానే త్రివిక్రమ్ నేరేట్ చేసిన స్క్రిప్టు అల్లు అర్జున్ కి నచ్చటం లేదని తెలుస్తోంది. దాంతో నవంబర్ నుంచి కదా షూటింగ్ అప్పటివరకూ స్క్రిప్టులో మార్పులు చేయమని పురమాయించాడని చెప్తున్నారు. ఖలేజా ప్లాప్ తో త్రివిక్రమ్ ఇఫ్పుడు ఎవరికీ నచ్చటం లేదు. అంతకుముందు త్రివిక్రమ్ పెన్ లో మ్యాజిక్ ఉందని తమను డైరక్ట్ చేయమని కబుర్లు పంపుతున్న వాళ్ళే ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.
ఇక ఈ అవకాశాన్ని దిల్ రాజు తనకు అనుకూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. వాసు వర్మచేత రెడీ చేయించిన స్క్రిప్టుని అల్లు అర్జున్ కి పంపి చదివించాడు. అంతేగాక వెంటనే అల్లు అర్జున్ చెప్పిన మార్పులు చేయించి ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ బన్నీ డేట్స్ కోసం తిరుగుతున్నాడు. మరో ప్రక్క అల్లు అర్జున్ ని దిల్ రాజు తన ఆర్య ద్వారా సూపర్ హిట్ ఇచ్చి నిలబెట్టడంతో అతను కూడా మాట కాదనలేని సిట్యువేషన్ లో ఉన్నాడు. కాబట్టి అల్లు అర్జున్ ఇండియాకు వచ్చి త్రివిక్రమ్ ప్రాజెక్టు కాన్సిల్ చేయించి వెంటనే దిల్ రాజు సినిమా ప్రారంభించినా ఆశ్చర్యం లేదంటున్నారు.


Click it and Unblock the Notifications











