twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహర్షి చిత్రానికి కళ్ళు చెదిరే డీల్.. వరుసగా చరణ్, మహేష్, ఎన్టీఆర్!

    |

    Recommended Video

    Maharshi Hindi Satellite Rights Record Price | Filmibeat Telugu

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడి పల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని వంశీ పైడిపల్లి సరికొత్త కోణంలో చూపించబోతున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో హిందీ శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొని ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    సంచలనం.. ఐదు గెటప్పుల్లో మహేష్ విశ్వరూపం.. ప్రతి అరగంటకి మారిపోయేలా!సంచలనం.. ఐదు గెటప్పుల్లో మహేష్ విశ్వరూపం.. ప్రతి అరగంటకి మారిపోయేలా!

    25 కోట్లు డిమాండ్

    25 కోట్లు డిమాండ్

    మహర్షి చిత్ర హిందీ శాటిలైట్ హక్కుల కోసం దిల్ రాజు మొదట 25 కోట్ల భారీ మొత్తం డిమాండ్ చేసినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపించాయి. బాహుబలిని పక్కన పెడితే అప్పటికి రంగస్థలం చిత్రం 22 కోట్లతో రికార్డు సృష్టించింది. దీనితో తెలుగు సినిమాకు హిందీ మార్కెట్ లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని దిల్ రాజు 25 కోట్లు డిమాండ్ చేసినట్లు చెబుతున్నారు.

    తెలుగు సినిమాకు

    తెలుగు సినిమాకు

    తెలుగు చిత్రాన్ని హిందీ లో డబ్ చేసి యూట్యూబ్ లోకి వదిలితే చాలు గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ దూసుకొస్తున్నాయి. ఇటీవల హిందీ సంస్థల కన్ను తెలుగు సినిమాపై పడింది. ఎంత ధర వెచ్చించి అయినా శాటిలైట్ హక్కులు సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు.

    కళ్ళు చేరిరే డీల్

    కళ్ళు చేరిరే డీల్

    దిల్ రాజు 25 కోట్లు డిమాండ్ చేసినప్పటికీ ఓ సంస్థ 20 కోట్లు వెచ్చించి మహర్షి చిత్ర హిందీ శాటిలైట్ హక్కులు సొంతం చేసుకునేందుకు ముందుకు వచ్చిందట. ఈ మేరకు దిల్ రాజు వారితో డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు.

     వరుసగా మూడు చిత్రాలు

    వరుసగా మూడు చిత్రాలు

    ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర హక్కులు 18 కోట్లకు అమ్ముడయ్యాయి. అరవింద సమేత 18 కోట్ల వద్దే ఆగిపోవడంతో దిల్ రాజు 20 కోట్ల డీల్ కు అంగీకారం తెలిపాడట. హిందీ శాటిలైట్ హక్కుల విషయంలో రంగస్థలం, మహర్షి, అరవింద సమేత చిత్రాలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

    English summary
    Dil raju Demands 25 cr for Maharshi Hindi Satellite rights. But Deal fixed with 20 cr
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X