దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్.. పాన్ ఇండియా రేంజ్ లోనే బిగ్ ప్లాన్.. దర్శకుడు ఎవరంటే?
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన ప్రస్తుతం భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే శాకుంతలం సినిమాలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. అలాగే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీని 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని పట్టాలు ఎక్కించదానికి దిల్ రాజు రెడీ అవుతున్నారు. తాజాగా ట్విట్టర్ లో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ నెక్స్ట్ పాన్ సినిమాగా జటాయు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి రాబోతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏకంగా వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.

ఇప్పటికే ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా కోసం స్టార్ క్యాస్టింగ్ ని ఎంపిక చేసే పనిలో టీమ్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇక క్యాస్టింగ్ అంతా కూడా ఫైనల్ అయ్యాక మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో పాటు సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నట్లు సమాచారం.
విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా ఉండనుంది. లార్జ్ స్కేల్ పై దిల్ రాజు ఈ సినిమాని ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. అయితే ఇంద్రగంటి చివరి రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దిల్ రాజు బ్యానర్ లో నాని, సుదీర్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కించిన వి మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే సుదీర్ బాబు హీరోగా తెరకెక్కించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది.
వరుస రెండు ఫ్లాప్ లతో ఉన్న దర్శకుడితో ఏకంగా వంద కోట్లకి పైగా బడ్జెట్ తో ప్రాజెక్ట్ చేయడం అంటే హై రిస్క్ అనే చెప్పాలి. అయితే దిల్ రాజు మాత్రం ఫ్లాప్ అయిన దర్శకులతోనే మరల బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రోజులు ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇంద్రగంటి ఈ మూవీతో హిట్ ఇస్తాడని దిల్ రాజు నమ్మకంగా ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











