అంత జరిగినా తగ్గేదేలే అంటున్న దిల్‌రాజు .. చరణ్ కోసం భారీ ప్లాన్?, స్ట్రాంగ్ పాయింట్‌తో

తెలుగు సినిమా ఆడియెన్స్ ఓ సినిమాని ఏ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . అలా తెలుగు నాట పర భాషా సినిమాలు కూడా అక్కడ ప్లాప్ అయ్యినవి మన దగ్గర ఓ రేంజ్ లో ఆదరించినవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ డబ్బింగ్ సినిమాలలో కొన్ని రీరిలీజ్ లలో కూడా భారీ వసూళ్లు అందుకుంటాయి.

ఆ సినిమాలకే ఈ రేంజ్ లో ఉంటే మన తెలుగు స్టార్ హీరోల సినిమాల సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలా తెలుగులో చేసే సంబరాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే నిలుస్తాయి. ఇందుకే తెలుగు మార్కెట్ కోసం చాలా మంది స్టార్స్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో మార్కెట్ స్పాన్ పెరగడంతో సినిమాలకి ముందే అనుకున్న డేట్స్ కంటే ముందే రిలీజ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చేస్తున్నాయి.

dil raju have big plan for game changer premiers in telugu states

యూఎస్ మార్కెట్‌లో మాత్రమే ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ పడితే ఆ సంప్రదాయం మన దగ్గర కూడా నెమ్మదిగా ఊపందుకుంది. కానీ అది రీసెంట్ గా పుష్ప 2 చిత్రంతో షాకింగ్ గా మారిపోయింది. ఓ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో జరిగిన విషాదం ఏంటి అనేది అందరికీ తెలుసు. దీనితో ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రీమియర్ షోస్ ఉండవు అని చాలా మంది అనుకున్నారు.

ముఖ్యంగా పుష్ప 2 తర్వాత వచ్చే భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ల "గేమ్ ఛేంజర్". ఈ మూవీపై బాగా ఎఫెక్ట్ పడుతుందని, పుష్ప 2 సేఫ్ అయ్యిపోయింది అనే టాక్ వచ్చింది. కానీ ఇపుడు ఈ విషయంలో నిర్మాత దిల్ రాజు వెనక్కి తగ్గేదేలే అంటున్నారట. ఖచ్చితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందే ప్రీమియర్స్ ఉంటాయి అని రీసెంట్ గా ఆయన స్వయంగా కన్ఫర్మ్ చేశారు.

dil raju have big plan for game changer premiers in telugu states

దీనితో గేమ్ ఛేంజర్ విషయంలో ఫ్యాన్స్ కొంచెం ఊపిరి పీల్చుకున్నారు . కానీ తెలంగాణాలో పర్మిషన్ దొరుకుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై దిల్‌రాజు దగ్గర క్రేజీ పాయింట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. పుష్ప 2 విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన అన్ని స్క్రీనింగ్స్ లో ఒక్క హీరో హాజరైన చోట మాత్రమే తొక్కిసలాట జరిగింది. అంతే తప్పించి మరెక్కడా ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు కదా అని ఆ రకంగా పర్మిషన్స్ గాని తెచ్చుకుంటారు అని టాక్ అనిపిస్తుంది.

లాజికల్ గా ఇది నిజమే అని చెప్పాలి. తెలంగాణ‌లోనే తీసుకుంటే పుష్ప 2కి 4వ తేదీ రాత్రే అనేక థియేటర్స్ లో భారీ లెవెల్లో షోస్ వేశారు. కానీ ఎక్కడా కూడా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తరహా ఘటన జరిగిన సందర్భం లేదు. ఈ పాయింట్ తో దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున గేమ్ ఛేంజర్ షోస్ ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి వీటిపై మరిన్ని డీటెయిల్స్ ఇంకా బయటికి రావాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X