twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓటీటీలో వకీల్ సాబ్.. చిక్కుల్లో దిల్ రాజు? ఏం జరిగిందంటే..

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ అయిన వకీల్ సాబ్ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ కలెక్షన్స్ విషయంలో కాస్త గందరగోళం ఏర్పడింది కానీ మిగతా చోట్ల బాగానే వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సినిమా డిజిటల్ రిలీజ్ కి కూడా రంగం సిద్ధమైంది. రేపటి నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉండనుంది. అయితే ఇదే ఇప్పుడు దిల్ రాజు కొంపముంచింది అని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    సూపర్ హిట్ వకీల్ సాబ్

    సూపర్ హిట్ వకీల్ సాబ్

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కింది.. హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన పింక్ అనే సినిమాకు ఇది తెలుగు రీమేక్.. పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా అంజలి, నివేదా థామస్, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ కం బ్యాక్ మూవీ అని అందరూ భావించారు.

    అక్కడ తప్ప మిగతా అంతా సేఫ్

    అక్కడ తప్ప మిగతా అంతా సేఫ్

    అయితే ఈ సినిమా వసూళ్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్ముతున్నారని కారణం సాకుగా చూపుతూ అప్పటికప్పుడు ప్రత్యేక జీవో తీసుకొచ్చి థియేటర్ల టికెట్ రేట్లు ఎక్కడికక్కడ కోసి పారేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. ఆంధ్రప్రదేశ్ విషయం పక్కన పెడితే మిగతా చోట్ల ఈ సినిమా బాగానే పర్ఫార్మ్ చేసింది. ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది.

    థియేటర్ల మూతతో

    థియేటర్ల మూతతో

    అయితే ఇది ఇలా ఉండగా కరోనా సెకండ్ దెబ్బతో తెలంగాణలో థియేటర్లన్నీ మూసివేశారు. వకీల్ సాబ్ ఆడుతున్న థియేటర్లకు మినహాయింపులు ఇచ్చినా సరే జనాలు కరోనా దెబ్బకు బయటకు రావడం మానేశారు. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ కలెక్షన్ల మీద పెద్దగా ఆశలు లేకుండా పోయాయి. ఇక కరోనా వల్ల జనాలు బయటకు రాకుండా ఉండడంతో ఓటీటీ మీద ప్రెజర్ పడుతోంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాని ముందే రిలీజ్ చేసుకుంటామని దిల్ రాజుతో అగ్రిమెంట్ చేసుకుంది. వాస్తవానికి ఈ సినిమా 56 రోజుల తర్వాత రిలీజ్ చేయాలన్నది నిబంధన.

     అదనంగా 12 కోట్లు

    అదనంగా 12 కోట్లు

    కానీ థియేటర్లు మూసివేత కారణంగా 20 రోజుల్లోనే సినిమా రిలీజ్ చేసుకోవచ్చని దిల్ రాజు ఒప్పుకున్నాడు. అయితే నిజానికి ముందుగా వకీల్ సాబ్ సినిమాని 14 కోట్ల రూపాయలకు అమెజాన్ ప్రైమ్ సంస్థకు కొనుక్కుంది. కానీ ఇప్పుడు 20 రోజుల్లోనే రిలీజ్ చేసేందుకుగాను మరో పన్నెండు కోట్లు అదనంగా దిల్ రాజు అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆ 12 కోట్లు కూడా కలిపి మొత్తం 26 కోట్లు పెట్టి ఈ సినిమాని అమెజాన్ సంస్థ కొన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం దిల్ రాజు చిక్కుల్లో పడేలా చేసింది.

    Recommended Video

    #VakeelSaab : Vakeel Saab Movie Team Ugadi Special Interview Part 4 | Pawan Kalyan | Venu Sriram
     లీగల్ చిక్కుల్లో దిల్ రాజు

    లీగల్ చిక్కుల్లో దిల్ రాజు

    ఈ సినిమా దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మీద లీగల్ కేసు వేస్తానని చెబుతున్నట్లు తెలుస్తోంది. దానికి కారణం సినిమా అమ్ముతున్న సమయంలో డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా కచ్చితంగా 50 రోజుల వరకు ఎలాంటి ఓటీటీలో రిలీజ్ చేయమని దిల్ రాజు ఖచ్చితమైన మాట ఇచ్చాడట. కానీ ఇప్పుడు ఆ మాట తప్పి కేవలం 20 రోజుల్లోనే సినిమాని డిజిటల్ రిలీజ్ ఇచ్చేయడంతో దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. అలా చేయడం వల్ల తాను మూడు కోట్ల రూపాయల దాకా నష్టపోతాను అని ఆ నష్టపరిహారం కనుక దిల్ రాజు చెల్లిస్తే లీగల్ గా ప్రొసీడ్ అవ్వకుండా ఉంటానని ఆయన తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే దిల్ రాజు ప్రస్తుతానికి సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో ?

    English summary
    Pawan Kalyan’s comeback film Vakeel Saab will be premiering on Amazon Prime Video tomorrow. But reports suggest that the producer of Vakeel Saab, Dil Raju might land in a legal mess for permitting the early digital premieres. Distributor based in Dubai is threatening to file a legal case against Dil Raju for not honouring the 50-day agreement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X