For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహేష్, అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్.. ‘రిలీజ్ వార్’కు తెర దించేందుకు క్రేజీ ప్రొడ్యూసర్ రంగంలోకి..

|

టాలీవుడ్‌లో సంక్రాంతి పండగ సీజన్ భారీ సినిమాలతో కళకళలాడేందుకు రంగం సిద్ధమవుతున్నది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ పక్క రెడీ అవుతుంటే.. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్‌తో బరిలోకి దిగనున్నారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి-మహేష్‌బాబు కాంబినేషన్‌లో సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ శ్రీనివాస్-అల్లు అర్జున్ కలయికలో అల వైకుంఠపురములో చిత్రం ఒకే రోజు విడుదల కావడం వివాదంగా మారింది.

ఈ రెండు చిత్రాలు కూడా జనవరి 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు పోటాపోటీగా చిత్ర యూనిట్లు ప్రకటించడంతో తెలుగు సినీ పరిశ్రమలో గందరగోళం నెలకొన్నది. అయితే ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆరోగ్యకరంగా లేదనే వాదన మధ్యలో ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే..

 పోటీని నివారించేందుకు

పోటీని నివారించేందుకు

సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో చిత్రాల రిలీజ్‌ను ఒకే రోజున కాకుండా వేర్వేరు తేదీలలో విడుదల చేసేందుకు సినీ పెద్దలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం. రెండు భారీ సినిమాల మధ్య పోటీని నివారించేందుకు ఇద్దరు హీరోలతో వ్యక్తిగతంగా నిర్మాత మండలిలోని ప్రముఖులు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఫిలింనగర్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి.

దిల్ రాజు రంగంలోకి

దిల్ రాజు రంగంలోకి

ఇక సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురంలో ఒకే రోజు రిలీజ్ కావడంపై ప్రముఖ నిర్మాత, పంపిణిదారుడు దిల్ రాజు అసంతృప్తిగా ఉన్నారట. ఇద్దరు స్టార్ల సినిమాలు ఒకే రోజు రావడం వల్ల వ్యాపారపరంగా ఇద్దరు హీరోలపై ప్రభావం పడే అవకాశముందనే భావనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించేందుకు దిల్ రాజు రంగంలోకి దిగుతున్నారనే విషయం మీడియాలో చర్చనీయాంశమైంది. మహేష్, అల్లు అర్జున్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల వారితో చర్చించి ఈ పోటీని నివారించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు తెలిసింది.

సీక్రెట్ మీటింగ్ కోసం

సీక్రెట్ మీటింగ్ కోసం

సంక్రాంతి సీజన్‌లో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఒక తేదీన.. అల వైకుంఠపురంలో సినిమాను మరో తేదీన విడుదల చేసే ప్రయత్నాలు ముమ్మరమైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మహేష్, అల్లు అర్జున్ మధ్య ఓ సీక్రెట్ మీటింగ్‌ను ఏర్పాటు చేసేందుకు ఆయా చిత్ర యూనిట్లు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. త్వరలోనే వీరిద్దరి మీటింగ్ తర్వాత రిలీజ్ డేట్లు మార్చి అధికారికంగా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఫ్యాన్స్‌లో కూడా అసంతృప్తే

ఫ్యాన్స్‌లో కూడా అసంతృప్తే

ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు ఒకే రోజున రావడంపై కూడా ఫ్యాన్స్, సినీ వర్గాలు అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలిసిందే. పండగ సీజన్‌లో వేర్వేరు తేదీలలో మూవీస్ రిలీజ్ అయితే ఇద్దరు హీరోలకు వ్యక్తిగతంగా ఫస్ట్‌డే ఓపెనింగ్స్ పెరగడానికి, కొత్త రికార్డులు నమోదు కావడానికి అవకాశం ఉంటుందనే అభిప్రాయం కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. దాంతో దక్షిణాదిలో తెలుగు సినీ పరిశ్రమ స్టామినా మరోసారి నిరూపించుకోవడానికి అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

విజయశాంతి, టబు రాకతో

విజయశాంతి, టబు రాకతో

మిలిటరీ నేపథ్యంతో సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దర్శకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా.. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రం ద్వారా సీనియర్ నటి విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక అల వైకుంఠపురం చిత్రాన్ని ఫ్యామిలీ, ఎమోషనల్ డ్రామాగా త్రివిక్రమ్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మరో సీనియర్ నటి టబు తెలుగు తెరపై మళ్లీ కనిపించేందుకు సిద్ధమవయయారు.

English summary
Dynamic producer Dil Raju is getting ready for to avoid Ala Vaikunthapurramloo clash with Sarileru Neekevvaru. Reports suggest that He is putting efforts to arrange a secret meet with Mahesh Babu and Allu Arjun.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more