twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిల్ రాజుది గోల్డెన్ హ్యాండా? గోతిలో నెట్టే హ్యాండా?

    By Bojja Kumar
    |

    అతితక్కువ కాలంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో నిలదొక్కుని అగ్రస్థానికి ఎదిగిన నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. తనతో సినిమాలు చేసే దర్శకులతో వరుసగా రెండు సినిమాలు చేయాలనే కండీషన్ తో ముందే పక్కాగా అగ్రిమెంట్ రాయించుకుంటారాయన. సదరు దర్శకులు మధ్యలో మరొక బ్యానర్లో సినిమా చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. ఇలా కొత్త దర్శకులతో సినిమాలు తీస్తూ దిల్ రాజు లాభాలతో పాటు మంచి సక్సెస్ రేటు సాధించాడు.

    అయితే దిల్ రాజుది గోల్డెన్ హ్యాండా?... గోతిలో నెట్టే హ్యాండా? అనే విషయం తేల్చుకోలేక సతమతం అవుతున్నారు పలువురు దర్శకులు. ఆయనతో పని చేసిన చాలా మంది దర్శకుల్లో కొందరికి మొదటి పయత్నంలో ఘోర పరాజయం ఎదురైతే, మరికొందరికి రెండో ప్రయత్నంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వంశీ పైడిపల్లి-దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన మున్నా సినిమా ఘోరంగా ప్లాపయితే, బృందావనం సినిమా మంచి విజయం సాధించింది.

    దిల్ రాజుతో 'కొత్త బంగారు లోకం" సినిమా చేసి మంచి సక్సెస్ సాధించిన శ్రీకాంత్ అడ్డాల రెండో సినిమాగా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" ప్రాజెక్టు చేస్తున్నాడు. మరో దర్శకుడు వాసువర్మ జోష్ లాంటి ప్లాపును ఎదుర్కొని...వేరే బ్యానర్ లో చేయడానికి అగ్రి మెంటు అడ్డొస్తుండటంతో దిల్ రాజు మరో అవకాశం ఎప్పుడిస్తాడా అని ఎదురుచూస్తున్నాడు.

    అయితే సుకుమార్(ఆర్య), బోయపాటి శ్రీను(భద్ర)లు మాత్రం రిల్ రాజు అగ్రిమెంట్ ను లెక్క చేయకుండా....ఇతర బ్యానర్లలో సినిమా చేస్తూ దూసుకెలుతున్నారు. ఈ నేపథ్యంలో....ఆయనతో పని చేయడానికి వచ్చే కొత్త దర్శకులు ఈ రెండు సినిమాల అగ్రిమెంటును చూసి జంకుతున్నారు.

    English summary
    Dil Raju gives opportunities for directors with a condition that they should do their second film also with him. This is becoming a curse for many.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X