దిల్ రాజు ప్రయోగాత్మక చిత్రం
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ ప్రయోగాత్మక చిత్రం ప్రొడ్యూస్ చేయబోతున్నారా...అవుననే వినపడుతోంది. కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రాన్ని ఆయన నిర్మించటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో ఆ చిత్రం సాగనుంది. ప్రకాష్ రాజ్ కు, దిల్ రాజు కు ఉన్న అనుబంధంతో ఈ చిత్రం ప్రొడ్యూస్ చేస్తారని చెప్పుకుంటున్నారు. గోవిందుడు అందరి వాడేలే చిత్రం తర్వాత కృష్ణవంశీ డైరక్ట్ చేస్తున్న చిత్రం ఇదే. తమిళ,తెలుగు భాషల్లో రూపొందనుందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం కథని గోవిందుడు అందరివాడే సమయంలో కృష్ణవంశీ ..ప్రకాష్ రాజ్ కు వినిపించాడని తెలుస్తోంది. ఈ కథ ఎప్పటినుంచో కృష్ణవంశీ మనస్సులో మెదులుతోందని, అయితే ప్రకాష్ రాజ్ కు, కృష్ణవంశీకు టెర్మ్స్ కు సరిగ్గా లేకపోవటంతో తెరకెక్కలేదని, రీసెంట్ గా గోవిందుడు కోసం ఇద్దరూ కలవటంతో మళ్లీ ఆ కథని బయిటకు తీసి ప్రకాష్ రాజ్ కు చెప్పటం, ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని తెలుస్తోంది.
మరో ప్రక్క గతంలో రాఖి చిత్రం రూపొందించిన కృష్ణవంశీ రీసెంట్ గా రెండు రోజుల క్రితం గోవా వెళ్లి ఎన్టీఆర్ ని కలిసారు. అక్కడ కథ వినిపించారని, బండ్ల గణేష్ ఈ చిత్రానికి నిర్మాత అని తెలుస్తోంది.

నిర్మాత బండ్ల గణేష్ తో గోవిందుడు అందరివాడేలే చిత్రం చేసిన కృష్ణ వంశీ మరో చిత్రం చేస్తానని గణేష్ కు మాట ఇచ్చాడని అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు తెరకెక్కుతోందని అంటున్నారు. అలాగే కృష్ణ వంశీ చెప్పిన కథ ...ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే కొన్ని మార్పులు చెప్పారని, ఆ మార్పులతో మళ్లీ కథ వినిపిస్తానని కృష్ణ వంశీ చెప్పినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ఎంత వరకూ మెటీరియలైజ్ అవుతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఎన్టీఆర్ గురించి గతంలో కృష్ణవంశీ మాట్లాడుతూ...ఆయన్ని మీ ఆలోచనలను సరిగ్గా వ్యక్తీకరించగల యాక్టర్ ఉన్నారా? అని అడగటం జరిగింది. అప్పుడు ఆయన...తారక్ ఈజ్ ఎక్స్‌లెంట్ ఇన్ రాఖీ. ఆ సినిమాలో మామూలు డైలాగుల్లోనే తీవ్రాతితీవ్రమైన ఆగ్రహాన్ని చూపించాలి. తారక్‌కు అది కొత్త. కానీ పెద్ద ఎన్టీఆర్‌నే మరిపించాడు.
ఇక మురారిలో మహేశ్... బాగా సిగ్గరి అన్నారు. అలాగే మరి అమీర్‌ఖాన్‌లాంటి నటులు మనకు లేరన్నారు? అని అడిగితే...ఈ మధ్యనే అలా అనిపిస్తోంది. 'తారే జమీన్ పర్, లగాన్' వంటి సినిమాల వెనుక 19 ఏళ్ల పరిశ్రమ ఉంది. రంగేలీ సినిమాకి అమీర్‌తో కలిసి పని చేశా అని సమాధానమిచ్చారు.
పాటల రచయిత సిరివెన్నెల అంటే ఎందుకంత అభిమానం అని అడిగితే...అదో విచిత్రబంధం. శివ టైంలో పరిచయం. ఆయన రాసిం ది ఫెయిర్ చేయడం, కోరిన సమాచారం ఇవ్వడం చేసేవాణ్ని అన్నారు. ఇక ఆయన మిమ్మల్ని దత్తత తీసుకున్నారా? అంటే... దాదాపు అలాంటిదే. గాయత్రి జంధ్యం వేసి క్రతువు జరిపించారు. మాది పూర్వజన్మ బంధమనిపిస్తుంది అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications











