»   » ఆ విషయంలో దిల్ రాజు ఫెయిల్: రజనీ చిత్రం చేజారింది!

ఆ విషయంలో దిల్ రాజు ఫెయిల్: రజనీ చిత్రం చేజారింది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులు దక్కించుకునేందుకు ప్రముఖ తెలుగు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అతనికి దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.

కబాలి చిత్ర నిర్మాత కలైపులి.ఎస్.థాను దిల్ రాజు తీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల విడదులైన విజయ్ చిత్రం 'పోలీసోడు' సినిమా విషయంలో దిల్ రాజు నిర్లక్ష్యంగా వ్యవహించడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.

Dil Raju Lost Rajini Film

విజయ్ హీరోగా తరకెక్కిరన తమిళ చిత్రం 'తేరి' తెలుగులో 'పోలీసోడు'(పోలీస్)గా రిలీజైన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈచిత్రాన్ని కలైపులి.ఎస్.థాను సొంతగా రిలీజ్ చేద్దామనుకున్నారు. అయితే దిల్ రాజు వెళ్లి అడగటంతో అతనికి అప్పగించాడట. అయితే సినిమా రిలీజ్ విషయంలో దిల్ రాజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించాడని కలైపులి అసంతృప్తిగా ఉన్నారట. సినిమాకు పబ్లిసిటీ కూడా సరిగా చేయలేదని, అందుకే సినిమా ఇతర ప్రాంతాల్లో హిట్టయినా తెలుగులో మాత్రం సరిగా ఆడలేని అంటున్నారు.

దిల్ రాజు లాంటి టాప్ ప్రొడ్యూసర్ ఇంత చెత్తగా పబ్లిసిటీ చేస్తారని ఊహించలేదు. అందుకే 'కబాలి' చిత్రాన్ని దిల్ రాజుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పగించే ప్రసక్తేలేదని కలైపులి.ఎస్. థాను నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరి దిల్ రాజు ఈ విషయంలో ఏం చేస్తారు? కలైపులి.ఎస్.థానును ఒప్పిస్తారా? లేక పోతే పోనీ అని సినిమాను వదులుకుంటారా? అనేది చూడాలి.

English summary
Tamil producer Kalaipuli S. Thanu is very upset with producer Raju for allegedly bad publicity of Vijay-starrer Police. With bad publicity, Raju has lost a good chance to release Rajini's Kabali.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu